చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్

congress-speed

Telangana Congress Leader getting ready to give power point presentation on Irrigation Projects in the Telanagana State.

This is for Telugoda: For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis from telugoda.

తెలుగు సామెతను కాస్త కూనీ చేసినట్లు మీకు టైటిల్ తో అనిపించినా అసలు మ్యాటర్ మాత్రం అదే. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎలాగో మన కాంగ్రెస్ నాయకులకు ఇన్నాళ్లకు తెలంగాణ సర్కార్ మీద దుమ్మెత్తిపోయడానికి, కేసీఆర్ చెప్పిన మాటకు ఎదురుచెప్పడానికి సమయం కుదిరింది. అప్పుడెప్పుడో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై సిఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది గుర్తుందా.. అప్పటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ం తప్పుల తడక అని వాదిస్తున్న కాంగ్రెస్ నాయకులు తామిచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో దాన్ని నిరూపిస్తామని ప్రకటించారు. కానీ నాయకుల మధ్య సమన్వయలోపం – అసలేం ప్రజెంట్ చేయాలనే స్పష్టత లేకపోవడంతో దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటికి అందుకు ముందుకు వచ్చారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన సమయంలోనే  కౌంటర్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడైంది. అప్పటినుంచి సుదీర్ఘ కసరత్తు చేస్తున్న హస్తం పార్టీ నేతలు….ఫైనల్ అవుట్ పుట్ ను రెడీ చేశారు. కేసీఆర్ సర్కార్ గూగూల్ మ్యాప్ తో వివరిస్తే కాంగ్రెస్ పార్టీ ఒకడుగు ముందుకు వేసింది. ఏకంగా 3డీ టెక్నాలజీతో ప్రజెంటేషన్ కు ప్లాన్ చేసింది. ఈ నెల 23 న ప్రజెంటేషన్ ను డేట్ ఫిక్స్ చేశారు. తమ ప్రజెంటేషన్ లో భాగంగా  కృష్ణా – గోదావరి నదుల నీటిని ఎలా వాడుకోవాలో ప్రత్యామ్నాయం చూపిస్తామంటున్నారు.

ఇదిలాఉండగా తమ ప్రజెంటేషన్ కు కూడా అసెంబ్లీలో అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే దీనిపై స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయినప్పటికీ రిజర్వాయర్లు లేకుండానే తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించడం ఎలాగో చూపించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు.హర్యానాలోని జవహర్ లాల్ నెహ్రూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఇందుకు ఉదహారణగా చెప్పనున్నారు. ఇంతకూ ఈ సర్కార్ కు కౌంటర్ గా చెబుతున్న ఈ ప్రజెంటేషన్ ను ఎవరు ఇవ్వనున్నారు అనేదేగా మీ ప్రశ్న? పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఈ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు.!

Related posts:
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
కృష్ణా పుష్కర భక్తులకు హెచ్చరిక: కృష్ణా జలాల్లో బ్యాక్టీరియా
ముద్రగడ సవాల్
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
కాశ్మీర్ భారత్‌లో భాగమే
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
అమెరికా ఏమంటోంది?
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
మోదీ ఒక్కడే తెలివైనోడా?
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే

Comments

comments