కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?

TDP can bags only 57 seats in Elections

ఏపిలో తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఓటేసినా ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల నాడు హామీలిచ్చినా… అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటిని విస్మరించారు. దీంతో బాబు సర్కార్ మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏ వర్గానికి చెందిన వారు కూడా సంతోషంగా లేరు అని చాలా సర్వేల్లో తేలింది.

ప్రజల్లో పార్టీ గురించి ఎలాంటి స్పందన ఉంది, ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉంది లాంటి అనేక అంశాల్లో నారా చంద్రబాబు నాయుడు సర్వేలు చేయించడం చూశాం. అలాగే వైసీపీ పార్టీ కూడా ఎన్నో సర్వేలు నిర్వహించింది. అయితే అన్నింటి కన్నా నారా చంద్రబాబు నాయుడు కోడలు, నందమూరి బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి నిర్వహించినట్లు చెబుతున్న ఓ సర్వే మీద మాత్రం  సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ సర్వేను  ఒక ధర్డ్ పార్టీతో నిర్వహించినా వచ్చిన ఫలితాలను చంద్రబాబుతో చర్చించినట్లు తెలుగుదేశం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏంటీ అన్న దానిపై నారా బ్రాహ్మణి సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం, బిజెపి కూటమికి కేవలం 57 సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నట్లు ఆ సర్వేలో తేలింది. తెలుగుదేశం పార్టీకి కేవలం 57 సీట్లు మాత్రమే రావడంపై నారా బ్రాహ్మణి చంద్రబాబు నాయుడుతో చర్చించిందట. కాగా ఈ 57 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి అన్నది కూడా అందరికి ఆసక్తిరేపుతున్న అంశం. చేతిలో అనుకూల మీడియా ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అనేదానిపై అందరూ గుసగుసలాడుతున్నారు.

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అథికారంలోకి వచ్చినా కానీ తన హామీలను అమలుపరచడంలో మాత్రం వెనకబడ్డారు. అన్నింటికి మించి చంద్రబాబు నాయుడు మోదీతో ఎంతో స్నేహంగా ఉన్నా కానీ ఏపికి మాత్రం ప్రత్యేక హోదా మాత్రం తీసుకురాలేకపోయారు. దాంతో చంద్రబాబు సర్కార్ మీద ప్రజలకు సహజంగా వ్యతిరేకత ఏర్పడింది. అలాగే ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని.. తర్వాత దాని గురించి పట్టించుకోకపోవడం కూడా పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోందని బ్రాహ్మణి సర్వేలో తేలింది. అలాగే రైతులకు రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చినా ఇప్పటికీ ఆ హామీ అమలుకాలేదు. ఇలా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సర్కార్ మీద వ్యతిరేకత పెరగడానికి ప్రత్యేక హోదా, కాపుల రిజర్వేషన్లు, రైతు రుణ మాఫీలు కారణాలుగా తేలింది. మొత్తానికి ఏదిఏమైనా కానీ ఎన్నికలు వస్తే మాత్రం తెలుగుదేశం 57 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నట్లు క్లీయర్ గా తేలింది. 175 సీట్లలో 57 మినహా మిగిలిన అన్ని సీట్లలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ జయకేతనం ఎగరవేయనున్నట్లు తెలిసింది. మరి చూడాలి భవిష్యత్ లో ఏం జరగుతుందో?!

 

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
అడకత్తెరలో కేసీఆర్
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
ఇక యుద్ధమే కానీ..
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
మీకో దండం.. ఏం జరుగుతోంది?
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!

Comments

comments