తెలుగుదేశంలో ఆగష్టు భయం

TDP leaders fears about August Month

TDP leaders fears about August Month. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

ఆగస్టు నెల తెలుగుదేశం నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆగస్టులో ఏదో ఒక సంక్షోభం ఎదురవుతూనే ఉంది. భారీ స్థాయి కుదుపు నుంచి చిన్న చితక ఎదురు దెబ్బలను ఇదే నెలలో చవిచూసింది. 1983లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1984 ఆగస్టు 15న నాదెండ్ల భాస్కరరావు మొదటిసారి ఆగస్టులోనే షాక్‌ తగిలింది. టీడీపీ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు….కాంగ్రెస్‌ మద్దతుతో ఎన్టీఆర్‌ సర్కార్‌ను కూల్చివేసి 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు 31 రోజులు పాటు ఏపీని పాలించారు. అప్పట్లో ఈ రాజకీయ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి దేశంలో రాజకీయ సమీకరణల మార్పుకు దారితీసింది. 1984 నుంచే ఆగస్టు అంటేనే టీడీపీ నేతలకు భయం పుట్టుకొస్తుంది.

1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 1995 ఆగస్టులోనే రెండో సంక్షోభం ఎదురయ్యింది. ఆ సంవత్సరం ఆగస్టు 23న చంద్రబాబునాయుడు… ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆగస్టు అంటేనే టీడీపీ నేతలు హడలిపోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ ఇప్పుడు కూడా ఆగస్టులో సంక్షోభ సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు టీడీపీ నేతలను భయపెడుతున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ రాజ్యసభలో చేసిన ప్రకటన రాష్ట్రంలో తీవ్ర రాజకీయ వేడి పెంచింది.కాగా ప్రత్యేక హోదా విషయంలొ ఇప్పటికే ఇరుకున్న టిడిపి కేంద్రంలో మోదీతో కూడా తెగతెంపులు చేసుకొని కొత్త సంక్షోభానికి తెర తీస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో ఘటనలకు ఆగష్టు సాక్షంగా నిలిచింది. ఈసారి కూడా  ఇదే ఆగష్టులో జరగకూడదనిది.. ఊహించనిది జరగనుందా అంటే అది టైం మాత్రమే నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ బంధం తెగిపోతుందేమోనన్న భయం తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. ఆగస్టు సంక్షోభం ఎప్పుడు… ఎలా .. ముంచుకొస్తుందో చెప్పలేమంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

Related posts:
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
అహా... అందుకేనా..?!
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
పంజా విసిరిన జననేత
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
మన ఖాతాలే మోదీ టార్గెట్?

Comments

comments