టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు

TDP Leaders recording dances on New year eve

తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, వాళ్ల బాగోతాల గురించి కథలు కథలుగా చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగిస్తున్న అరాచక పాలనలో, కింది స్థాయి నాయకులు కూడా రెచ్చిపోతున్నారు. చింతలపూడి ప్రభాకర్ లాంటి వాళ్లు ఏకంగా ప్రభుత్వాధికారుల మీదే తమ ప్రతాపం చూపిస్తున్నా.. మిన్నకుండిపోయిన ఘనత నారా చంద్రబాబుగారి సొంతం. ఇక అయ్యవారే ఇంత చనువిస్తే మిగిలిన వాళ్లు మాత్రం ఊరుకుంటారా? అందుకే తాజాగా కనిగిరి ఎమ్మెల్యే తన కళను ప్రదర్శించాడు.

అసలే కొత్త సంవత్సరం ఏర్పాటు జరుగుతున్నాయి.. అందునా కనిగిరి ఎమ్మెల్యే మంచి ఉత్సాహంగా ఉన్నారు..చుట్టూ అమ్మాయిలు.. రెచ్చగొడుతున్న ఆడియన్స్ ఇక సార్ గారికి ఊపు ఆగలేదు. వెంటనే కాలు దువ్వేశారు. కాలు దువ్వడం అంటే ఏదో గొడవకు అనుకునేరూ.. కానే కాదు రికార్డింగ్ డ్యాన్స్ లకు. అవును కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూ రావు, కనిగిరి మున్సిపల్ చైర్మెన్ లతో కలిసి తెగ రెచ్చిపోయి చిందులు వేశారు. నలుగురికి చెప్పాల్సిన, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఇలా చేసినందుకు చూసిన వాళ్లంతా షాక్ కు గురయ్యారు.

ఇక అన్నింటికి మించిన ట్విస్ట్ టీవీ9ది. అసలు మీడియా మేనేజ్ మెంట్ బాగా తెలిసిన చంద్రబాబు నాయుడు గారికి వంత పాడటంలో టీవీ9 మాత్రం అస్సలు తక్కువ తినలేదు. అందుకే స్వామి భక్తిని చాటుకుంది. కనిగిరి ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మెన్ వేసిన చిందులను తెలుగు టీవీ9లో కాకుండా కన్నడ టీవీ9లో చూపించడం జరిగింది. అయితే దీనిపై జగన్ డిజిటల్ సేన ఘాటుగా స్పందించింది. మెరుగైన సమాజం కోసం అని కాకుండా మెరుగైన టిడిపి కోసం అని ట్యాగ్ మార్చుకుంటే బెటర్ అంటూ జనాలు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఎంతైనా నారా చంద్రబాబు నాయుడుగారి ఎల్లో మీడియా కదా ఇలానే ఉంటుందేమో.

Related posts:
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
జగన్ అన్న.. సొంత అన్న
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
స్థూపం కావాలి
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
జియోకు పోటీగా ఆర్‌కాం
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
మోదీ ఒక్కడే తెలివైనోడా?
గాలిలో విమానం.. అందులో సిఎం
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
వంద విలువ తెలిసొచ్చిందట!
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

Comments

comments