సిరీస్ టీమిండియా సొంతం

Team India bags England series with Mumbai match

టీమిండియా మరోసారి విజృంభించింది. ముంబై వేదికగా కోహ్వీ తన అద్భుత ఆటతీరును అభిమానులకు చూపించారు. 3-0 ఆధిక్యంతో టీమిండియా ఇంగ్లడ్ సిరీస్ ను దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించి సిరీస్ ను సొంతం చేసుకుంది. దాంతో ఐదు మ్యాచుల సిరీస్ మూడు మ్యాచుల ద్వారానే టీమిండియా సొంతం చేసుకుంది. మూడో మ్యాచ్ ఐదో రోజు అశ్విన్ అద్భుతమైన బాలింగ్ తో టీమిండియా విజయం సులభమైంది. అశ్విన్ బెయిర్ స్టో, వోక్స్, రషీద్, ఆండర్సన్ లను ఔట్ చేశారు. దాంతో టీమిండియా విజయం ఖరారైంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 400, టీమిండియా 631 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 195 పరుగులకే ఆలౌట్ అవడంతో ఇంగ్లండ్ సిరీస్ ను టీమిండియాకు సమర్పించేసింది.

ఇక ఈమ్యాచ్ లో విరాట్ కోహ్లీ రికార్డుల సునామీ సృష్టించాడు. ఇప్పటికే బ్యాటింగ్ లో టాప్ గా నిలిచిన కోహ్లీ తాజా ముంబై మ్యాచ్ తర్వత కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టాడు.  విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో మూడో మ్యాచ్ లో సాధించిన కొత్త రికార్డులు ఇవే…

* ఈ ఏడాది అన్ని ఫార్మాట్లూ కలుపుకొని అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి అవతరించాడు.
* భారత్ తరఫున ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ద్రవిడ్ (602 పరుగులు) రికార్డును విరాట్ అధిగమించాడు.
* జయంత్ యాదవ్‌తో కలిసి 8వ వికెట్‌కు భారత్ తరఫున అత్యధిక పరుగుల (241) భాగస్వామ్యాన్ని కోహ్లి నెలకొల్పాడు.
* ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లి చోటు సంపాదించాడు. క్లార్క్ 2012లో నాలుగు డబుల్ సెంచరీలు నమోదు చేయగా.. మూడు డబుల్ సెంచరీలు సాధించిన మెకల్లమ్‌‌, పాంటింగ్, బ్రాడ్‌మ్యాన్‌తో కలిసి కోహ్లి రెండోస్థానంలో ఉన్నాడు.
* ఈ మ్యాచ్‌లో కోహ్లి 235 పరుగులు చేశాడు. టెస్టుల్లో భారత కెప్టెన్‌ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. గతంలో ధోనీ ఆస్ట్రేలియాపై 224 పరుగులు చేశాడు.
* వాంఖడేలో కోహ్లి సాధించిన 235 పరుగులు రెండో అత్యధికం.
* వాంఖడేలో అద్భుత ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో బ్యాటింగ్ సగటు 50 దాటింది. టెస్టులు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలో 50కిపైగా సగటు ఉన్న ఏకైక బ్యాట్స్‌మెన్ కోహ్లి మాత్రమే.
* ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన వినోద్ కాంబ్లి రికార్డును విరాట్ అధిగమించాడు. 1993లో వాంఖడేలో కాంబ్లి ఇంగ్లండ్‌పై 224 రన్స్ చేశాడు.
* కోహ్లి ఈ మ్యాచ్‌లో ఒకే ఒక సిక్స్ కొట్టాడు. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లి ఇప్పటి వరకూ రెండు సిక్సర్లు మాత్రమే బాదాడు.
* ఒక ఏడాదిలో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన భారత కెప్టెన్‌గా కోహ్లి.. సచిన్ రికార్డును సమం చేశాడు. ఈ ఏడాది కోహ్లి టెస్టుల్లో 4 శతకాలు సాధించాడు.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్

Comments

comments