వన్డేలో టీమిండియా విజయం

Team India great victory in first oneday match with newzeland

టీమిండియా మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. ఇటు బ్యాటింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ టీమిండియా తడాఖా చూపించింది. టీమిండియా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ధోనీ సేన 1-0 ఆధిక్యాన్ని కనబరిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 43.5 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. లాథమ్ (98 బంతుల్లో 79, 7 ఫోర్లు, 1 సిక్స్), సౌతీ (45 బంతుల్లో 55, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. తర్వాత భారత్ 33.1 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసింది. రహానే (34 బంతుల్లో 33, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. మ్యాచ్‌కు 15 నిమిషాల ముందు కపిల్ దేవ్ నుంచి వన్డే క్యాప్ అందుకున్న హార్డిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఆరంభంలో పేసర్లు హార్డిక్ పాండ్యా , ఉమేశ్  లు చెలరేగితే.. మ్యాచ్ మధ్యలో మిశ్రా స్పిన్ మ్యాజిక్‌ను చూపెట్టాడు. టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి ఓ దశలో 106 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన కివీస్‌ను లాథమ్, సౌతీ తొమ్మిదో వికెట్‌కు 71 పరుగులు జోడించి న్యూజిలాండ్ పరువు నిటబెట్టారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో గప్టిల్ తో మొదలైన వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు.106 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండయా మొదట్లో కాస్త వెనకబడింది.

భారత ఓపెనర్లలో రహానే ఫర్వాలేదనిపించినా రోహిత్ (14) విఫలమయ్యాడు. ఎనిమిది బంతుల వ్యవధిలో ఈ ఇద్దరు మూడు సిక్సర్లు బాదడంతో రన్‌రేట్ పరుగెత్తింది. అయితే 49 పరుగుల వద్ద టీమ్‌ఇండియా తొలి వికెట్ కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ మంచి బ్యాటింగ్ చేశాడు. కానీ 13వ ఓవర్‌లో రహానే అవుట్‌కావడంతో భారత్ స్కోరు 62/2గా మారింది. ఈ దశలో వచ్చిన మనీష్ పాండే (17) సింగిల్స్‌కు పరిమితం కావడం, కోహ్లీకి ఎక్కువగా స్ట్రయికింగ్ రాకపోవడంతో స్కోరు బోర్డు నిదానంగా కదిలింది. విరాట్‌ను వదిలిపెట్టి రెండో ఎండ్‌లో మనీష్‌ను లక్ష్యంగా చేసుకున్న కివీస్ 20వ ఓవర్‌లో ముచ్చటగా మూడో వికెట్‌ను సాధించింది.

తర్వాత వచ్చిన కెప్టెన్ ధోని (21) అండతో కోహ్లీ బౌండరీల మోత మోగించాడు. 24వ ఓవర్‌లో నీషమ్ బౌలింగ్‌లో భారీ సిక్సరుతో కెప్టెన్ క్రీజులో కుదురుకోగా, విరాట్ 55 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి నిలకడతో భారత్ స్కోరు 150 పరుగులకు చేరింది. అయితే సౌతీ వేసిన 28వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన కోహ్లీ.. మూడో బంతికి ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను బౌలర్ వదిలేశాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే ధోని అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. సాంట్నెర్ బంతిని ఫ్లిక్ చేసిన మహీ పరుగు కోసం ప్రయత్నించి వెనుదిరిగినా అప్పటికే కీపర్ రోంచి వికెట్లను గిరాటేశాడు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 60 పరుగులు సమకూరాయి. ఇక భారత్ గెలుపునకు 21 ఓవర్లలో 29 పరుగులు చేయాల్సిన దశలో కేదార్ జాదవ్ (10 నాటౌట్), కోహ్లీలు నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌తో టీమిండియాకు విజయాన్ని సాధించిపెట్టారు.

Related posts:
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
మూడో టెస్ట్ లో మనదే విజయం
సిరీస్ టీమిండియా సొంతం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐకి సుప్రీం షాక్
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments