రెండో వన్డేలో ఓడిన టీమిండియా

Team India loose Second OneDay Match with Newzeland

న్యూజిలాండ్ తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరిగిన రెండో వన్డేలో చివరి వరకూ పోరాడిన భారత్ ఓటమి పాలైంది. 243 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా మరో మూడు బంతులు ఉండగానే 236 రన్స్ కు ఆలౌటైంది. హార్డిక్ పాండ్యా ఒంటరిపోరాటంతో గెలుపు ఆశలు చిగురించినా.. చివర్లో హార్డిక్, బుమ్రా వెంటవెంటనే అవుటవడంతో ఓటమి పాలైంది. టాస్ గెలిచిన ధోనీ మొదట న్యూజిలాండ్‌కు బ్యాటింగ్ అవకాశం కల్పించారు. ఇన్నింగ్స్ రెండో బంతికే గుప్టిల్ ను డకౌట్ చేసి ఉమేష్ యాదవ్ బ్రేక్ ఇచ్చాడు. అయితే లాథమ్, కెప్టెన్ విలియమ్సన్.. కివీస్ ను ఆదుకున్నారు.

నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు120 రన్స్ జోడించారు. లాథమ్ 46 రన్స్ చేసి ఔటైనా.. మరో ఎండ్ లో విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. భారీ స్కోరు దిశగా సాగుతున్న కివీస్ ఇన్నింగ్స్‌కు అమిత్ మిశ్రా ముకుతాడు వేశాడు. మొదట టేలర్, అండర్సన్‌లను అవుట్ చేసిన మిశ్రా.. జోరు మీదున్న విలియమ్సన్‌ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. మరో ఎండ్‌లో బుమ్రా కూడా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 242 రన్స్ చేసింది. భారత బౌలర్లలో మిశ్రా, బుమ్రా చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

243 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో ధాటిగా ఆడినట్లే కనిపించినా ఆ తర్వాత తడబడింది. రోహిత్ రహానే, కోహ్లీ, మనీష్ పాండే నిరాశపరచడంతో 73 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ధోనీ, జాదవ్ అయిదో వికెట్‌కు 66 రన్స్ జోడించి కుదుటపరిచే ప్రయత్నం చేశారు. అయితే జాదవ్ 39 రన్స్, ధోనీ 41 రన్స్ చేసి అవుటవడంతో 183 రన్స్‌కు 8 వికెట్లు కోల్పోయింది. గెలుపు ఆశలు అడుగంటిన వేళ ఉమేష్ యాదవ్‌తో కలిసి హార్డిక్ పాండ్యా ఒంటరిపోరు సాగించాడు.

తొమ్మిదో వికెట్‌కు 49 రన్స్ జోడించి కివీస్‌కు కాస్త చెమటలు పట్టించాడు. చివరి మూడు ఓవర్లలో విజయానికి 22 పరుగులు అవసరమైన దశలో హార్ధిక్ పాండ్య నిలకడగా ఆడుతూ గెలుపుపై ఆశలు రేపినా.. జట్టు స్కోరు 232 వద్ద అతను ఔటైపోవడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. చివర్లో పేసర్ సౌథీ విసిరిన యార్కర్ బంతిని ఎదుర్కోలేక బుమ్రా క్లీన్ బౌల్డవడంతో న్యూజిలాండ్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ పర్యటనలో కివీస్‌కు ఇదే తొలి విజయం. ఈ గెలుపుతో 5 వన్డేల సిరీస్ 1-1తో సమమైంది.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments