రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Team India won second one day match

టీమిండియా అద్భుతమైన ఆటకు గ్రౌండ్ మొత్తం ఫిదా అయింది. క్రికెట్ లో టీమిండయాకు సహజ శత్రువుగా ఉన్న ఇంగ్లండ్ మీద వీరవిహారం చేసింది. టెస్టుల్లోనే కాదు..వన్డే సిరీస్‌లోనూ మనోళ్లే మొనగాళ్లు… కటక్‌ వన్డేను 15 పరుగుల తేడాతో గెల్చుకున్న విరాట్ సేన.. సిరీస్‌నూ ఖాతాలో వేసుకుంది… 382 పరుగుల టార్గెట్ ఛేజింగ్‌లో ఇంగ్లండ్ 366 పరుగులే చేయగలిగింది… మెరుపు సెంచరీతో భారత్‌ను టెన్షన్ పెట్టిన ఇయాన్ మోర్గాన్… ఇంగ్లండ్‌ను గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు… భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు, జస్‌ప్రీత్ బూమ్రా రెండు వికెట్లు తీసుకున్నారు.

భారీ స్కోర్ టార్గెట్‌గా ఉన్నా… ఇంగ్లండ్ పోరాడింది… జేసన్ రాయ్, జో రూట్ , మెయిన్ ఆలీ హాఫ్‌ సెంచరీలు చేస్తే, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ఇయాన్ మోర్గాన్ 81 బాల్స్‌లో 102 పరుగులు చేశాడు. ఓ స్టేజ్‌లో గెలుపుపై ఆశలు పెంచుకుంది ఇంగ్లండ్.. మోర్గాన్ రనౌట్ కావడంతో.. భారత్ ఊపిరి పీల్చుకుంది.. కానీ, ఒత్తిడి మరీ ఎక్కువైపోవడంతో… ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లకు ప్రయత్నించి అవుటైపోయారు. కటక్ మ్యాచ్ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే, భారత్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. రీఎంట్రీలో అద్భుతమైన సెంచరీ బాదేసిన యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డ్‌ గెల్చుకున్నాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో వన్డే 22న కోల్‌కతలో జరుగుతుంది.

Related posts:
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
మూడో టెస్ట్ లో మనదే విజయం
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి

Comments

comments