మూడో టెస్ట్ లో మనదే విజయం

Team India won third test match in mohali

టీమిండియా మరోసారి విజయపతాకాన్ని ఎగరవేసింది. కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ లో నేడు జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. మొత్తం ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా ఇప్పటికి రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను ఆదిక్యంలో కొనసాగిస్తోంది. వైజాగ్ టెస్ట్ లో టీమిండయా తత్తరబాటును ఈ మ్యాచ్ లో సరిదిద్దుకుంది. 102 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన టీమిండియా క్రికెటర్లు రెండు వికెట్లు కోల్పోయి 104 పరుగులు సాధించి విజయాన్ని నమోదు చేశారు.

నేడు మొహాలీ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ను ఒక‌రోజు ఆట మిగిలి వుండ‌గానే ఓడించింది కోహ్లీ సేన. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 283 ప‌రుగుల‌కు కుప్ప‌కూలిపోయింది. ఆ త‌రువాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 417 ర‌న్స్ చేసి ఇంగ్లాండ్‌పై ఆధిప‌త్యాన్ని సాగించింది. ఆ త‌రువాత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ టీమిండియా బౌల‌ర్ల‌ను త‌ట్టుకోలేక 236 ప‌రుగుల‌కే చ‌తికిల‌ప‌డిపోయింది. స్పిన్న‌ర్స్ ర‌వింద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ అద్బుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్‌కి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఇంగ్లాండ్ టెస్టుల‌తో అరంగేట్రం చేసిన జ‌యంత్ యాద‌వ్ అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ త‌న స‌త్తాను చాటుకున్నాడు.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐకి సుప్రీం షాక్
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments