సింధూరంలో రాజకీయం

Political-game

భారత కీర్తి పతాకాలను ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన తెలుగు తేజం పివి సింధుకు దేశం మొత్తం దాసోహమైంది. ఫైనల్ లో ఆమె ఆడిన తీరు అందరిని ఆకట్టుకుంది. భారత్ ఖాతాలో తొలి రజితాన్ని వేసింది. అలాంటి సింధుకు దేశవ్యాప్తంగా అభినందనలతో పాటుగా కాసుల వర్షం కూడా కురుస్తోంది. అంతకు ముందు హర్యాణాకు చెందిన సాక్షి మాలిక్ రియోలో కాంస్య పతకాన్ని సాధించడంతో వెంటనే హర్యానా రెండు కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. దాంతోపాటు ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ఇక్కడ సాక్షి మాలిక్ విషయంలో హర్యాణా ప్రభుత్వం చూపిన ఉదారత తెలంగాణ సర్కార్ మాత్రం చూపించలేదు. సిల్వర్ మెడల్ సాధించి దేశానికి మణిహారం తొడిగిన సింధుకు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నజరానాను ప్రకటించింది. ఇక్కడ కోటి రూపాయల నజరానా తక్కువ అని కాదు కానీ సింధు ఆట ముందు ఇది మాత్రం తక్కువే. ఎందుకు అంటే హర్యాణా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కన్నా ఎంతో వెనకబడిన రాష్ట్రం. తెలంగాణ బడ్జెట్ లో హర్యాణా బడ్జెట్ సగం ఉంటుంది. మరి అలాంటి చిన్న రాష్ట్రమే తమ రాష్ట్ర అథ్లెట్ రియోలో కాంస్యం గెలిస్తే రెండు కోట్లు ప్రకటించినప్పుడు.. తెలంగాణ సర్కార్ మాత్రం కేవలం కోటి అని ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ సర్కార్ తాము కోటి రూపాయలు ప్రకటిస్తున్నాము.. అనే దాని కన్నా గతంలో ఉన్న ప్రైజ్ మనీని 16 లక్షల నుండి కోటికి పెంచాము అని హైలెట్ చెయ్యడం విశేషం. దిల్లీ గవర్నమెంట్ సింధుకు రెండు కోట్ల నజరానాను ప్రకటించింది. అయినా కూడా తెలంగాణ సర్కార్ నుండి మరో ప్రకటన వెలువడలేదు. అయితే ఇక్కడ దీన్ని రాజకీయ కోణంలో కూడా చూడాల్సి వస్తుంది. ఫైనల్ మ్యాచ్ కంటే ముందే ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తాను చేసిన కార్యక్రమాల వల్లే ఇవాళ సింధు రియోలో తన సత్తా చూపుతోంది అని ప్రకటించారు.

పివి సింధు క్రెడిట్ ను ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ ద్వారా తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు. తన హయంలోనే పుల్లెల గోపీచంద్ అకాడమీని స్థాపించి.. ఇప్పుడు ఫలితాలను సాధిస్తున్నారు అన్నట్లు మాట్లాడారు. దీంతో అందరూ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇలా తన వల్ల వచ్చిందే ఇదంతా అన్న టైంలో తెలంగాణ సర్కార్ కోటికి మించి ప్రకటించినా ఆ క్రెడిట్ పెద్దగా అధికారపార్టీకి రాదు అని ఆలోచిస్తున్నట్లు కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్ ఉదారత గురించి అందరికి తెలుసు. తనకు నచ్చితే దేనికీ వెనకడుగువేసే వ్యక్తి కాదు. పుష్కరాలకు, పండగలకు, సంబరాలకు అంటూ కోట్లకు కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్.. తెలంగాణ, భారత్ కీర్తిని ప్రపంచవ్యాపితం చేసిన సింధు విషయంలో మాత్రం ముందడుగు వెయ్యలేకపోతోంది అంటే అది దేనికి సంకేతం. పోనీ క్రీడాకారులకు పెద్దగా ప్రోత్సహించరు అంటే అది కూడా కాదు. గతంలో సానియామీర్జా పెద్దగా ఫాంలో లేనప్పుడే ఆమెకు రెండు కోట్లు ప్రకటించి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. మరి ఇంత తెలిసీ.. కేసీఆర్ కు ఆ మాత్రం తెలియదా.? అంటే ఖచ్చితంగా తెలుసు అనే సమాధానమే వస్తుంది. అయినా కేసీఆర్ మనసులో ఏముందో ఎవరికి తెలుసు.. లోగుట్టు పెరుమాళ్లకెరుక అంటే ఇదేనేమో.

Related posts:
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
పవన్ ను కదిలించిన వినోద్
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
టాప్ గేర్ లో ముద్రగడ
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
చెత్త టీంతో చంద్రబాబు
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
పిట్టల దొరను మించిన మాటల దొర
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
పైసలు వసూల్ కాలేదుగా..
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments