ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు

Telangana case between India And Pakistan

ఇండియా, పాకిస్థాన్ మధ్యలో తెలంగాణ కేసు ఏంటీ..? అసలు అర్థం కాలేదే అనుకుంటున్నారా.? మొత్తం వివరణ ఇస్తున్నాం చదవండి. ఇది లండన్ లో వేసిన కేసు. గత 60 సంవత్సరాలుగా ఈ కేసు అలా పెండింగ్ లో ఉంది. బహుశా పెండింగ్ లో ఉన్న కేసుల్లో ఈ కేసు రికార్డు కూడా కొట్టేస్తుందేమో. కాగా కేసు కేవలం ఇండియా, పాకిస్థాన్ లకు సంబందించినదే కానీ మధ్యలో తెలంగాణ మాత్రం దానిపై మాకు హక్కు ఉంది అంటూ బరిలోకి దిగింది. ఇంతకీ దేనీ మీద ఈ కేసు అనుకుంటున్నారా..? లండన్ లోని నాట్ వెస్ట్ బ్యాంక్ లో 1948లో డిపాజిట్ చేసిన 1 మిలియన్ యూరోల గురించి. అయితే అది ఇప్పుడు 35 మిలియన్ యూరోలుగా మారింది. అంటే అక్షరాల 267 కోట్ల రూపాయలు అని అర్థం.

నాటి నిజాం రాజు 1948లో లండ‌న్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో 1 మిలియ‌న్ యూరోలు డిపాజిట్ చేశార‌ట‌. అప్ప‌టికీ హైద‌రాబాద్ రాష్ట్రం భార‌త్‌లో ఇంకా విలీనం కాలేదు. హైద‌రాబాద్ రాష్ట్రాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేసే ఆలోచ‌న‌లో నిజాం రాజు ఉండేవాడ‌ట‌. అయితే హైద‌రాబాద్‌కు పాకిస్తాన్‌కు కొన్ని వేల కిలోమీట‌ర్లు దూరంగా ఉండ‌టం, భౌగోళికంగా కూడా క‌ష్టంగా ఉండ‌టంతో నిజాం రాజు ఆ ఆలోచ‌న విరమించుకున్నాడు.

1948లో లండ‌న్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న‌పాక్ హైకమిష‌న‌ర్ ఖాతాలో ఒక మిలియ‌న్ యూరోలు డిపాజిట్ చేశాడు నిజాం రాజు.  ఆ త‌ర్వాత భార‌త ప్ర‌భుత్వం ఒత్తిడి తేవ‌డంతో ఆ అకౌంట్‌ను ఫ్రీజ్ చేశాడు. అంటే ఎలాంటి లావాదేవీలు జ‌ర‌గ‌కుండా చూశాడు.  అనంత‌రం 1948 సెప్టెంబ‌ర్‌లో హైద‌రాబాద్ రాష్ట్రం భార‌త్‌లో విలీనం అయ్యింది. ప్ర‌స్తుతం ఆ సొమ్ము వ‌డ్డీతో క‌లిపి 35 మిలియ‌న్ యూరోల‌కు చేరింది. ఈ సొమ్ము మాదంటే మాదంటూ భార‌త్, పాకిస్తాన్ ప్ర‌భుత్వాలు వాదిస్తున్నాయి. అయితే క్యాష్ ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యేందుకు రెండు రోజుల ముందే భార‌త్‌లో విలీనం అయ్యింది హైద‌రాబాద్ రాష్ట్రం. నిజాం రాజు త‌న డ‌బ్బును వాప‌స్ తీసుకుందామ‌ని ప్ర‌య‌త్నించాడు. త‌నకు తెలియ‌కుండానే ఇది జ‌రిగిందంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అస‌లు ఈ సొమ్ము ఎవ‌రికి చెందిన‌దో.. లీగ‌ల్‌గా ప‌లు అంశాలు త‌లెత్త‌డంతో బ్యాంక్ డ‌బ్బును వాప‌స్ ఇవ్వ‌లేమ‌ని తేల్చిచెప్పింది.

ఇక అప్ప‌టి నుంచి భార‌త్ పాకిస్తాన్ ప్ర‌భుత్వాలు దీనిపై కేసులు వేస్తూనే ఉన్నాయి. 1957లో చివ‌రిసారిగా వాద‌న‌లు జ‌రిగాయి. చివ‌ర‌కు ఈ కేసు బ్రిట‌న్ హౌజ్ ఆఫ్ లార్డ్స్‌కు చేరుకుంది. అంద‌రి అంగీకారంతోనే అకౌంటును ఓపెన్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. రీసెంట్‌గా లండ‌న్‌లోని పాక్ హైక‌మిష‌న‌ర్ ద్వారా పాక్ ప్ర‌భుత్వం ఈ అమౌంట్‌పై అక్క‌డి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఆ సొమ్ము త‌మ‌కే చెందుతుంద‌ని అందులో పేర్కొంది. కాగా నిజాం డిపాజిట్ చేసింది హైదరాబాద్ రాష్ట్రం నుండే కాబట్టి అది అక్షరాల తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది అనే వాదన వినిపిస్తోంది. కేంద్రం నుండి దర్యాప్తు కోసం వచ్చిన అధికారులకు కూడా తెలంగాణ సర్కార్ అందుకే పూర్తి స్థాయిలో సహకరిస్తోందని తెలంగాణ ఉన్నతాధికారులు వెల్లడించారు. మొత్తానికి ఈ కేసు ఎటు తేలి.. ఎవరికి సొమ్ము చేరుతుందో చూడాలి.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
సింధూరంలో రాజకీయం
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
బాబు Khan
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
జగన్ క్రిస్టియన్ కాదా!
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?

Comments

comments