కేసీఆర్ – నమోకు జై.. డిమోకు జైజై

Telangana cm KCR supports NaMo and DeMo

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళుతోంది. అయితే కేంద్రం తీసుకువచ్చిన పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశం మొత్తం కకావికలం అవుతోంది. కొన్ని రాష్ట్రాలు అయితే కేంద్రం నిర్ణయంతో చాలా నష్టపోయాయి.. నష్టపోతున్నాయి కూడా. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతోంది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మోదీ నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత మొదటిసారి ఓ ముఖ్యమంత్రితో మోదీ చర్చసాగించడం వార్తల్లో నిలిచింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన ప్రత్యేకంగా చర్చించారు. ఇక నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ లో నరేంద్ర మోదీకి జై కొట్టారు. అయితే గుడ్డిగా కాకుండా చాలా సైద్ధాంతికంగా డీమానిటైజేషన్ కు(డిమో) జై కొట్టారు.

దేశంలో నల్లధన నిర్మూలనకు మోడీ ప్రయత్నిస్తున్నారని… బ్యాంకుల ద్వారా పారదర్శకంగా నగదు లావాదేవీలు జరగాలన్న ఉద్ధేశ్యంతో ప్రధాని నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ మోదీ నిర్ణయాన్ని వెనకేసుకువచ్చారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రాలు బిత్తరపోకుండా, డిజిటలైజ్ అవుతే సరిపోతుంది అని కూడా అన్నారు. ఈ దిశగా తెలంగాణ పాలనా వ్యవస్థను డిజిటలైజ్ చెయ్యడానికి చర్యలకు ఉపక్రమించారు.అందులో కీలక అడుగు వేస్తూ టీఎస్ వాలెట్ ను ఐటీ డిపార్ట్ మెంట్ ద్వారా  తీసుకొస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు.

కేంద్ర నిర్ణయాన్ని అమలు చేయడంలోనూ రాష్ట్రాల పాత్ర ఉందని కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలుచెయ్యాల్సిందేనని.. అమలు చెయ్యడంలో ఉన్న ఇబ్బందులను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. ఇదే అంశాన్ని తాను మోదీతో కూడా చర్చించినట్లు కేసీఆర్ వెల్లడించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వంలోని  విలైనన్నీ డిపార్ట్ మెంటలలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇలా మోదీ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా సపోర్ట్ చెయ్యడంతోపాటుగా, తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలకు దిగారు కేసీఆర్.

Related posts:
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
జగన్ అన్న.. సొంత అన్న
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
స్టే ఎలా వచ్చిందంటే..
ఏపీ బంద్.. హోదా కోసం
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
సదావర్తి సత్రం షాకిచ్చింది
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
నారా వారి అతి తెలివి
అమెరికా ఏమంటోంది?
బెంగళూరుకు భంగపాటే
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ

Comments

comments