లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ

Telangana, Protest, Congress, Telangana Pradesh Congress Committee

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విడగొట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో దాదాపుగా అతీగతీ లేకుండాపోయింది. కనీసం పార్టీ జెండాలు మోసేందుకు కూడా జనాలు కరువతయ్యారు. విభజన తర్వాత ఓట్లు వస్తాయనుకున్న పార్టీ పెద్దలకు ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. అధికారాన్ని చేపట్టిన తర్వాత కేసీఆర్ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ తో ఒక్కసారిగా వలసలు పెరిగాయి. దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరు కీలక నేతలు పార్టీని వీడారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో చలనం కనిపిస్తున్నట్లనిపిస్తోంది.

టిఆర్ఎస్ అధికారాన్ని చేపట్టి రెండున్నర సంవత్సరాల తర్వాత డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్లే్ందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి పనులు మొదలుపెట్టింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతా మీటింగ్ పెట్టి అధికార పక్షాన్ని తిప్పలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల ద్వారా ప్ర‌భుత్వంపై పోరు చేయాల‌న్న ఎత్తుగ‌డ రివ‌ర్స్ అయిన నేప‌థ్యంలో కొత్త ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లబ్ధిదారుల నుంచి వ్యక్తిగత దరఖాస్తులు సేకరించే ఉద్యమం చేపట్టాలని టీ కాంగ్రెస్‌ నిర్ణయించింది. దరఖాస్తులను ఈ నెల 17 నుంచి నెలాఖరు వరకు సేకరించ‌నున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా లబ్ధిదారులైన విద్యార్థులను కాలేజీల్లో కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తులు సేకరిస్తారు. గ్రామాల్లో రైతుల పేరు, కుటుంబ వివరాలు, భూమి, అప్పు, తీరిన రుణం లాంటి వివరాలతో దరఖాస్తు తీసుకుంటామని, వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడతారు. ఇలాగైనా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌వ‌చ్చ‌నే భావ‌న‌తో ఆ నేత‌లు ఉన్నార‌ని అంటున్నారు.మొత్తానికి చాలా లేట్ గా కాంగ్రెస్ నాయకులు జనాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఇంత కాలం కుంభకర్ణ నిద్రపోయిన కాంగ్రెస్ మహాశయులు ఇప్పటికైనా జనాల్లోకి వెళ్లడంలో సక్సెస్ అవుతారా.? అన్నది చూడాలి.

Related posts:
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
ఆయనకు వంద మంది భార్యలు
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
బాబోయ్ బాబు వదల్లేదట
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
సదావర్తి సత్రం షాకిచ్చింది
2018లో తెలుగుదేశం ఖాళీ!
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..

Comments

comments