మీది ఏ జిల్లా..? ఇదీ తంటా

Dist-ts

తెలంగాణలో కొత్త జిల్లాలు నిప్పురాజేశాయి. సిఎం కేసీఆర్ చేస్తున్న హడావిడితో కొత్త జిల్లాల ప్రతిపాదన ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రకటించిన జిల్లాల లిస్ట్ పై ఆగ్రహజ్వాలలు రేగాయి. మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ తో సహా అన్ని జిల్లాల్లో పరిస్థితి అలానే ఉంది. తెలంగాణ కొత్తగా 17 జిల్లాలను కలుపుకొని 27 జిల్లాలుగా ఏర్పడనుంది. 15 కొత్త రెవెన్యూ డివిజన్లు… 46 కొత్త మండాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రతిపాదనలపై అభ్యంతరాలుంటే  సెప్టెంబర్ 21లోపు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగానే కొత్త జిల్లాల ఏర్పాటు చేపట్టింది టీఆర్ఎస్ సర్కార్. ఐతే ఒకేసారి కొత్తగా 17 జిల్లాలను ఏర్పాటు చేస్తుండడం విశేషం. 37 ఏళ్ల తర్వాత జిల్లాల ఏర్పాటు జరుగుతున్నది. తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం-1974, తెలంగాణ జిల్లాల ఏర్పాటు నిబంధనలు-2016 ప్రకారమే హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలను పునర్విభజించి నూతన జిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన, విలీనం తదితర అంశాలపై వివరణ ఇచ్చే ఒక పత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. దసరానాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తజిల్లాల్లో పనులు షురూ అయ్యేలా సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.

మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా గళం వినిపించింది. ఆందోళనకారులు ఏకంగా ఓ బస్సుకు నిప్పుపెట్టారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సిరిసిల్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలు ప్రభుత్వం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చారు. కాగా మిగిలిన ప్రాంతాల్లో మాత్రం నాయకులు సంబరాలు చేసుకున్నారు.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
ఇది గూగుల్ సినిమా(వీడియో)
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
మంత్రుల ఫోన్లు బంద్
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
అమెరికా ఏమంటోంది?
యుపీలో ఘోర రైలు ప్రమాదం
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
మోదీ ఒక్కడే తెలివైనోడా?
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్

Comments

comments