తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ

Telangana govt effected with Currency Ban

పెద్ద నోట్ల వల్ల సగటు జీవి ఎలాగూ ఇబ్బందులుపడుతున్నాడు. బ్యాంకుల ముందు క్యుకట్టి మరీ డబ్బులు తీసుకుంటున్నాడు. నల్లధనం మీద యుద్ధం అంటూ మోదీ ప్రారంభించిన పెద్ద నోట్ల బ్యాన్ మీద ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాగా తెలంగాణలో పరిస్థితి అయోమయంగా ఉన్నట్లు సమాచారం. అందుకే కేసీఆర్ మోదీని కలిసి, నోట్ల బ్యాన్ మీద చర్చించనున్నారని వార్తలు వస్తున్నాయి. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ఖజానాలో డబ్బులు ఖాళీ అయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. వ్యాపార లావాదేవీలన్ని నిలిచిపోయాయి. పారిశ్రామికోత్పత్తిపైనా ప్రభావం చూపింది. ప్రభుత్వానికి రాబడి తగ్గిపోయింది. దాంతో తెలంగాణలో ఖజానా ఖాళీ అయ్యింది. దీంతో ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన విత్తం కూడా సర్కారు దగ్గర లేకపోవడంతో ఓవర్‌ డ్రాఫ్ట్‌ దిశగా పయనిస్తోంది. అందుకే తెలంగాణ సర్కార్ ఎక్కడికక్కడ డబ్బుల కోసం ఉన్న అన్ని దారుల కోసం తహతహలాడుతోంది.

తెలంగాణ ప్రభుత్వం… ఇప్పుడు ఖర్చులు తగ్గించుకుంటోంది. బిల్లుల చెల్లింపులను నిలిపివేస్తోంది. కాంట్రాక్టర్లకు అన్ని రకాల చెల్లింపులను తాత్కాలికంగా ఆపివేసింది. ఇది పనుల నత్తనడకకు కారమణమవుతోంది. సాగునీటి ప్రాజెక్ట్‌లు, రోడ్లు, గృహ నిర్మాణంతోపాటు… సంక్షేమ పథకాల అమలుపైనా ప్రభావం చూపింది.  విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ను కూడా కొంతకాలంపాటు నిలిపివేసింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, రిటైరైన ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపు, వృద్ధాప్య, వింతంతు, వికలాంగ పింఛన్లను ప్రాధాన్యతా క్రమంలో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది. మొత్తానికి మోదీ నిర్ణయంతో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ సర్కార్ కూడా తీవ్ర కష్టాలుపడుతోంది. మరి దీనికి పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో ఏమిటో??

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
అహా... అందుకేనా..?!
స్టే వస్తే కురుక్షేత్రమే
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బాబుగారి చిరు ప్లాన్
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
ఓటుకు నోటు కేసును మూసేశారా?
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments