తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు

Telangana Govt Getting Five Benefits with High Court Bifurcation agitation

తెలంగాణ పదం వింటే గత కేంద్ర ప్రభుత్వం వణికిపోయేది. నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ నేతలు, ఉద్యోగులు కలిసి చూపించిన చుక్కలు ఇప్పటికీ వాళ్లకు కలలో వస్తుంటాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు మోదీకి కూడా ఎదురుకానుందా అనే తెలంగాణవాదుల వాదనను ఎట్టిపరిస్థితుల్లోనూ కొట్టివేయలేము. తెలంగాణ ప్రభుత్వం దిల్లీలోని కేంద్రానికి మరోసారి దడ పుట్టిస్తోంది. తెలంగాణ, ఏపిలకు కలిపి ఉమ్మడిగా ఉన్న హైకోర్టును వెంటనే విభజించాలని, న్యాయాధికారులను వెంటనే నియమించాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది. న్యాయాధికారుల ఉమ్మడి సెలవు, రాజీనామాలతో తప్పని సరి పరిస్థితిలో తెలంగాణ సర్కార్, కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.

వెంట వెంటనే కేంద్రానికి ఓ లేఖ రాసి.. హైకోర్టును విభజించాలని, న్యాయాధికారులను వారి వారి రాష్ట్రాలకు కేటాయించాలని కోరారు. ముందు నుండి కూడా హైకోర్టు విభజన మీద తీవ్ర ఆందోళన జరుగుతోంది. నిజానికి తెలంగాణ ఉద్యమ సమయం నుండి కూడా హైకోర్టులో ఉద్రిక్తత నెలకొంది. హైకొర్టు ఆవరణలోనే న్యాయవాదులు కొట్టుకోవడం, న్యాయాధికారులు రెండు వర్గాలుగా విడిపోవడం లాంటివి జరిగాయి. అయితే హైకోర్టు దీని మీద తీవ్రంగా స్పందించింది. కానీ ఇప్పుడు అదే హైకోర్టును విభజించాలని డిమాండ్ తో ఆందోళన సాగుతోంది.

కేంద్రాన్ని మరోసారి ఇరుకున పెట్టబోయేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చెయ్యాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో కేంద్ర మంత్రి సదానందగౌడ స్పందించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదానికి, కేంద్రానికి ఏంటి సంబందం అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం ఏపితో కేసీఆర్ చర్చలు జరిపి.. సమస్యను పరిష్కరించుకోవాలని బంతిని చంద్రబాబు కోర్టులో వేసే ప్రయత్నం చేసింది.

హైకోర్టు విభజన మీద ముందు నుండి టిఆర్ఎస్ పార్టీ గట్టి వాయిస్ ను వినిపిస్తోంది. అయితే మిగిలినపక్షాలు దీని మీద స్పందించకపోవడంతో మొత్తం క్రెడిట్ కేవలం టిఆర్ఎస్ ఖాతాలోనే పడనుంది. పైగా ఉద్యోగులకు ముందు నుండి మంచి ప్రయార్టి ఇస్తున్న కేసీఆర్ న్యాయాధికారులు చేస్తున్న ఆందోళనను తనకు అనుకూలంగా మార్చకున్నారు. ఇక్కడ కేసీఆర్ కు చాలా రకాలుగా లాభాలున్నాయి..

మొదటిది: ముందు నుండి ఆందోళన చేస్తున్నట్లు తెలంగాణ ప్రత్యేక హైకోర్టు వస్తుంది అని అందరికి తెలిసిన లాభం.
రెండవది: న్యాయాధికారుల ఆందోళనలో తెలంగాణ సర్కార్ పాలుపంచుకున్నందుకు మంచి మార్కలు పడతాయి.
మూడవది: కేంద్రం చేసిన రెండు రాష్ట్రాల మధ్య చర్చల అంశంతో చంద్రబాబు నాయుడు స్పందించడకపోవడంతో అది టిఆర్ఎస్, కేసీఆర్ కు ప్లస్ గా మారుతుంది.
నాల్గవది: అన్నింటికి మించి ముందు నుండి తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపుచూస్తున్న కేంద్రానికి కేసీఆర్, తెలంగాణ సర్కార్ సత్తా ఏంటో తెలిసివస్తుంది.
ఐదవది: ఈ ఆందోళన కారణంగా కృష్ణానది యాజమాన్య బోర్డు సెక్రటరీని పదవి నుండి తప్పించడం ద్వారా ఓ రకంగా తెలంగాణ కృష్ణా నది యాజమాన్య బోర్డును ప్రభావితం చేసింది.

Related posts:
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
బాబు Khan
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
పిట్టల దొరను మించిన మాటల దొర
జగన్ క్రిస్టియన్ కాదా!
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
మోదీ భజన అందుకేనా?
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే
రాహుల్ పై కరుణ ఆగ్రహం

Comments

comments