చెరువుల్లో ఇక చేపలే చేపలు

Telangana govt will shed fish into fish ponds

తెలంగాణలో ఆనందం వెల్లవిరుస్తోంది. గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు, చెరువులు అన్ని కూడా నిండుకుండల్లాగా మారాయి. తెలంగాణలో కుండపోతగా కురిసిన వర్షాలతో మొత్తం నీటితో కళకళలాడుతున్నాయి. అయితే దీని మీద తెలంగాణ సర్కార్ మరోకొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. చెరువులు నిండిన నేపథ్యంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబర్ 3 నుంచి ఈ కార్యక్రమం మొదలుకావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయ వల్ల చెరువులు నిండాయి. నిన్నటి దాకా బీటలుబారిన భూమిలో ఇప్పుడు నీళ్లతో నిండిపోయాయి. వర్షాలతో నిండుగా నిండిన చెరువు మరింత అందంగా కనిపించాలంటే – దాంట్లో చేపపిల్లలు చెంగుచెంగున దూకాల్సిందే. కొర్రమీను పిల్లలు కొత్తనీటి పులుపు తాగాల్సిందే. చేపకూ చెరువుకు తెగిపోయిన బంధానికి- పూర్వవైభవం తేవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. అందుకే నిండిన చెరువుల్లో తెప్పలుగా చేపపిల్లలు పెంచాలని సీఎం నిర్ణయించారు. 48 కోట్ల రూపాయలతో 4వేల 533 చెరువుల్లో సుమారు 35 కోట్ల చేపపిల్లలు పెంచడానికి ప్రణాళిక సిద్ధమైంది. అక్టోబర్ 3 నుంచి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విజయవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

చేపల పెంపకం ద్వారా తెలంగాణ పల్లెలు స్వయం సమృద్ధి సాధిస్తాయని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చేపల పెంపకం వల్ల ముదిరాజులు, బెస్తవారితో పాటు ఇతర కులాలకు చెందిన చేపల పెంపకందారుల సొసైటీ సభ్యుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. పల్లెల్లో చేపల పెంపకమనేది ప్రధాన ఆదాయ వనరుగా ఉండాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు తూతూ మంత్రంగా చేపట్టిన చేపల పెంపకం వాటిపై ఆధారపడిన కుటుంబాలను ఏమాత్రం ఆదుకోలేకపోయిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన సహకారం కూడా అంతంతమాత్రంగా ఉండేదని గుర్తు చేశారు. వందలాది సొసైటీలుంటే- ఐదారు సొసైటీలకు మాత్రమే లబ్ది చేకూరిందని సీఎం అన్నారు.

గత ప్రభుత్వాలు ఏనాడూ చేపల పెంపకాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టలేదని విమర్శించారు. ఆ ప్రభుత్వాలు నిర్ధేశించిన యాభై శాతం సబ్సిడీ కూడా భారమైపోయిందని చెప్పారు. అందుకే మత్య్సకారులను ఆదుకుని, వారిని ఆర్ధికంగా పరిపుష్టం చేయాలని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలోనే వంద శాతం ఉచితంగా చేపపిల్లలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు మత్య్సకారులకు స్కిల్ డెవలప్ మెంట్ తో పాటు అనుబంధ శిక్షణ తరగతులను కూడా ప్రభుత్వం చేపట్టబోతోంది. మొత్తానికి తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం గనక సఫలీకృతం అయితే మాత్రం తెలంగాణలోని ప్రతి పల్లె ఆర్థికంగా బలపడేందుకు అవకాశం లభిస్తుంది.

Related posts:
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
ఆటలా..? యుద్ధమా..?
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
మహిళలకు వైయస్ ప్రోత్సాహం.. గుర్తుచేసుకున్న నన్నపనేని
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
మోదీ చేసిందంతా తూచ్..
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
యాహూ... మీ ఇంటికే డబ్బులు
కొత్త నోట్లు దొరికితే ఏం చేస్తారో తెలుసా?
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?
బీసీసీఐకి సుప్రీం షాక్
ఏపికి యనమల షాకు
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments