బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం

Telangana Minister Harish Rao fired on HM

ఎప్పుడు ప్రశాంతంగా ఉండే తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారి ఆగ్రహం పీక్స్ కు వెళ్లింది. అప్పుడెప్పుడో ఉద్యమం టైంలో తప్ప మళ్లీ ఎప్పుడూ ఇంత కోపంగా కనిపించలేదు. ఉద్యయమం టైంలో పోలీసులను కూడా ఎడాపెడా తిట్టేసిన హరీష్ రావు.. మంత్రి పదవి చేపట్టిన తర్వాత మాత్రం ఎప్పుడూ కోపగించుకోలేదు. హరీష్ రావు మెదక్ జిల్లా కల్హేర్ మండలం సిద్దాపూర్ లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన ఓ ఘటన ఆయనకు విపరీతమైన కోపాన్ని తెప్పించింది.

హరీష్ రావు సిద్దాపూర్ లో హరితహారంలో పాల్గొని అక్కడి నుండి రాపర్తిలో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించేందుకు బయలుదేరారు. అయితే మార్గ మధ్యలో నల్లవాగు గురుకుల పాఠశాల విద్యార్థులు, ప్రిన్సిపాల్ లక్ష్మీభాయి మంత్రి కాన్వాయిని ఆపి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని కోరారు. అందుకు ఒప్పుకున్న మంత్రి హరీష్ రావు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటేందుకు సిద్దం అయ్యారు. తీరా చుస్తే అక్కడ గుంతలు తీసి లేవు. పార, నీళ్ళు కూడా లేవు. దాంతో హరీష్ రావు ఆగ్రహంతో బకరా మినిస్టర్ అనుకుంటున్నారా? ఇలాగేనా ఏర్పాట్లు చేసేది అంటూ అక్కడ ఉన్న వారిపై మండిపడ్డారు. దాంతో ప్రిన్సిపాల్ క్షమాపణ కోరడంతో మంత్రే స్వయంగా గుంత తీసి మొక్కలు నాటారు.

Related posts:
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
తెలంగాణకు ప్రత్యేక అండ
అంత దైర్యం ఎక్కడిది..?
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
గెలిచి ఓడిన రోహిత్ వేముల
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
చెబితే 50.. దొరికితే 90
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
అమ్మను పంపించేశారా?
దేశభక్తి అంటే ఇదేనా?
బంగారం బట్టబయలు చేస్తారా?
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్

Comments

comments