నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ

Telangana police interagate TDP Leader R Krishnaiah in Nayeem Case

తెలంగాణలో కలకలం రేపిన నయీం ఎన్ కౌంటర్ తర్వాత తాజాగా విచారణ మరింత వేగవంతం చేసింది తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్.ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఓ నేత తన పదవిని కూడా కోల్పోగా, తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు, బిసీ సంఘం నాయకుడు ఆర్. కృష్ణయ్యను తాజాగా నయీం కేసులో పోలీసులు విచారించారు. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన కృష్ణయ్యను సిట్ ఐజీ నాగిరెడ్డి ప్రశ్నించారు. గంటపాటు విచారణ కొనసాగింది. మాదాపూర్ భూ వివాదం సెటిల్ మెంట్ పై ప్రశ్నించినట్టు సమాచారం. నయీం తనకు తెలుసునని గతంలో కృష్ణయ్య చెప్పారు. తనను నయీం గురువుగా భావించేవాడని, అతడి దందాలతో తనకు సంబంధం లేదని  తెలిపారు.

నయీమ్‌తో సంబంధాలున్నట్టు వార్తలు వచ్చిన క్రమంలో కృష్ణయ్య అప్పట్లో స్పందించారు. ‘‘నయీమ్ 1986లో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో ఉన్నప్పట్నుంచే నా వద్దకు వచ్చేవాడు. విద్యార్థి సంఘాలతో కలసి చేసే ఉద్యమాలకు నేను నాయకత్వం వహించేవాడిని. అప్పట్నుంచే నయీమ్ నాకు శిష్యుడయ్యాడు. నన్ను గురువుగా భావించేవాడు. కానీ ఆ తర్వాత కార్యక్రమాలకు నాకు సంబంధం లేదు. గుడికి పోయే వాళ్లు ఎవరు, ఏంటని చూడనట్టే.. సమస్యలపై నా దగ్గరికి వచ్చే వాళ్లను కూడా నేను వ్యక్తిగత విషయాలు అడగను’’ అని ఆర్.కృష్ణయ్య అన్నారు. కాగా ఆర్.కృష్ణయ్య విచారణ రాజకీయ సర్కిల్స్ లో మాత్రం హాట్ హాట్ గా చర్చసాగుతోంది.

Related posts:
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
తాగుబోతుల తెలంగాణ!
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
‘స్టే’ కావాలి..?
సన్మానం చేయించుకున్న వెంకయ్య
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
ఆ సిఎంను చూడు బాబు...
అమెరికా ఏమంటోంది?
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న

Comments

comments