31 జిల్లాల తెలంగాణ… కొత్తగా నాలుగు జిల్లాలు

Telangana with 31 Districts

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇదివరకే ప్రకటించిన ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రకారం 17 కొత్త జిల్లాల ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా సిరిసిల్ల, గద్వాల, జనగామ, ఆసీఫాబాద్‌ జిల్లాలను కలిపి మొత్తంగా 31 జిల్లాల ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. కొత్త జిల్లాలకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ముసాయిదా నోటిఫికేషన్‌లో లేని నాలుగు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభ సభ్యులు కె కేశవరావు అధ్యక్షతన హైపవర్‌ కమిటీ వేసి రెండు, మూడు రోజుల్లోనే నివేదిక తెప్పించుకుని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

చిన్న జిల్లాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని, సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ సులభతరం అవుతుందని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకున్నందున జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెరిగినా అభ్యంతరం లేదన్నారు. దసరా రోజు ప్రారంభమయ్యే కొత్త జిల్లాలతో ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటే జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసీఫాబాద్‌ ప్రాంతాల ప్రజలు బాధతో ఉండటం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఈ మూడు జిల్లాలను ఏయే మండలాలతో కలిపి ఏర్పాటు చేయవచ్చన్న విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

మొత్తానికి ముందు నుండి అనుకున్నట్లుగానే కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు దాదాపుగా పూర్తి చేశారు. చిన్న పాలన విభాగాలతోనే మంచి ఫలితాలు వస్తాయని ప్రపంచ వ్యాప్తంగా గతానుభవాలు సూచిస్తున్నాయని, అదే సూర్పితో తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. సత్వర అభివృద్ధికి, స్థానిక వనరుల సద్వినియోగానికి, పేదరిక నిర్మూలనకు చిన్న జిల్లాలు ఏర్పాటు ఎంతగానో దోహదపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో మంత్రి, కలెక్టర్లు తమ కంప్యూటర్లలో కుటుంబాల వివరాలు నమోదు చేసుకుని స్వయంగా ఒక్కో కుటుంబం గురించి శ్రద్ధ తీసుకునే పరిస్థితి రావాలన్నారు. అందుకే ప్రతి జిల్లాలో సగటున 3 లక్షల కుటుంబాలు ఉండేలా జిల్లాల పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్టు తెలిపారు.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
2018లో తెలుగుదేశం ఖాళీ!
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత

Comments

comments