ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు

Telugoda questions to chandrababu naidu and TDP

ఓటుకు నోటు కేసు చంద్రబాబు నాయుడుకు తీవ్ర కష్టాలు తెచ్చిపెట్టింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ కీలక నేత రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ కు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. సూట్ కేసులో డబ్బులు అప్పజెప్పుతున్నప్పుడు రేవంత్ రెడ్డిని తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ చంద్రబాబు నాయుడు స్టీఫెన్ సన్ తో ‘‘మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ’’ అంటూ మాట్లాడినట్లు కూడా ఆడియో టేపుల్లో తేలింది. చంద్రబాబు నాయుడు మెడకు చుట్టుకున్న ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్న పరిస్థితులకు ప్రస్తుత హైకోర్ట్ తీర్పు కూడా కారణమే.

అసలు చంద్రబాబు నాయుడు మాత్రం తాను నిప్పు అని చెప్పుకుంటాడు. మరి అలాంటి నిప్పు తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుకు తెలుగోడ కొన్ని ప్రశ్నలు సూటిగా సంధిస్తోంది. ఆ ప్రశ్నలకు బాబుగారు సమాధానమిస్తారా..?

తెలుగోడ సూటి ప్రశ్నలు టిడిపికి, చంద్రబాబు నాయుడుకు :
1. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మరి ఇంత బాహాటంగా దొరికిపోయిన రేవంత్ ను పార్టీ నుండి ఎందుకు డిస్మిస్ చెయ్యలేదు..?
2. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. చట్టప్రకారం ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చెయ్యకూడదు. ఎందుకు కేసీఆర్ పై కేసుతో ముందుకు వెళ్లలేదు.?
3. ఫోన్ ట్యాపింగ్ లో ఇన్నాళ్లు ఈ వాయిస్ మీది కాదని తెలిసినప్పుడు ఈ వాయిస్ ఎవరిది అని కనుక్కోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు..? కేసు ఎందుకు పెట్టలేదు..?
4. ఓటుకు నోటు కేసు లో చంద్రబాబు నాయుడు వాయిస్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ రూఢీ చేసింది. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు నైతిక బాధ్యత వహిస్తూ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఎందుకు చెయ్యలేదు..?
5. చంద్రబాబు నాయుడు నిజాయితీ పరుడే అయితే తాజాగా ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశాలను అంగీకరించి విచారణకు సహకరించి కడిగిన ముత్యంలాగా బయటపడవచ్చు కదా..?

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
అతడికి గూగుల్ అంటే కోపం
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
జియోకే షాకిచ్చే ఆఫర్లు
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
బాబు గారి అతి తెలివి
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
తిరిగిరాని లోకాలకు జయ
జయ మరణం ముందే తెలుసా?
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
వాళ్లకు ఇదే చివరి అవకాశం
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు

Comments

comments