దిగజారుతున్న చంద్రబాబు పాలన

Telugu Desam party Vs Telugu desam party leaders

ఏపిలో అధికార తెలుగుదేశం పార్టీ ఏ రేంజ్ లో పరిపాలిస్తోందో అర్థం అవుతోంది. నారా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత భేషూగ్గా ఉందో సర్వేలు తేలతెల్లం చేస్తున్నాయి. సర్వేల్లో తెలుగుదేశం పార్టీకి భారీగా పరాభవం కలుగుతుందని, అలాగే చాలా చోట్ల కనీసం డిపాజిట్లు కూడా దక్కవు అని తేలింది. కాగా తెలుగు తమ్ముళ్లు కూడా తమ పార్టీ వ్యవహారాల మీద పెద్దలా సంతృప్తిగా లేరని తేలింది. తాజాగా అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఘటన పార్టీ పరిస్థితిని, చంద్రబాబు నాయుడు పాలన తీరును అద్దంపడుతుంది.

తాజాగా అనంతపురం జిల్లా జెడ్పీ సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. జెడ్పీ సమావేశంలో చర్చకు తావివ్వకుండా వేదిక దగ్గరకు వచ్చి తీవ్ర గందరగోళం సృష్టించారు. అవును.. మామూలుగా అయితే అధికారపక్షానికి చెందిన సభ్యులు ఏదో చర్చకు స్వాగతిస్తే.. దాన్నిప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవాలి. కానీ అనంతపురం జిల్లా జడ్పి సమావేశంలో తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వం మీద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తమకు జీతాలు చెల్లించడం లేదని, అనంతపురం జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ఉన్నా కానీ జడ్పీ సమావేశానికి మాత్రం హాజరుకావడంలేదని, తమను ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తానికి అనంతపురంలో తెలుగు తమ్ముళ్లే సభలో గందరగోళం సృష్టించడం మాత్రం వార్తల్లో నిలుస్తోంది. చంద్రబాబు నాయుడు పాలన ఎెంత బాగా ఉందో సాక్షాత్తు తెలుగు తమ్ముళ్లే జడ్పీ సమావేశంలో తేల్చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు దీనిపై తీవ్రంగా మండిపడ్డారు. సమావేశంలో గందరగోళం సృష్టించడం కరెక్ట్ కాదు అని, బయటి వ్యక్తులకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందని ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే సభలో ఉన్న కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా స్పందిస్తూ తన నిధుల నుంచి ఒక్కో జడ్పీటీసీకి అయిదు లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి తాను పది లక్షల రూపాయల చొప్పున కేటాయిస్తానని చెప్పారు. దీనిపై జడ్పీ సభ్యులు మండిపడ్డారు. ఎమ్మెల్యేల మాదిరిగా తాము కూడా గెలిచిన వాళ్లమే అని, డబ్బులు విదిల్చినట్లు మాట్లాడటం మాత్రం ఆగ్రహం కలిగిస్తోందని మండిపడ్డారు. మొత్తానికి సమావేశంలో మాత్రం తెలుగు తమ్ముళ్లు తమ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గొడవకు దిగడం కలకలం రేపింది.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
పెట్రోల్ లీటర్‌కు 250
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
సన్మానం చేయించుకున్న వెంకయ్య
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
ప్యాకేజీ కాదు క్యాబేజీ
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
బాబు గారి అతి తెలివి
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments