ఏం చేసినా తప్పు అంటే ఎలా..?

Telugu Media Negative news on AP CM Chandrababu Naidu and Krishna Pushkaralu

రాజు తలుచుకుంటే దెబ్బులకు కొదవా అనే ఓ సామెత ఉంది. రాజులాగే మీడియా కూడా అంతే. మీడియా వ్యవహరించే తీరు కూడా అచ్చం ఇలానే ఉంటుంది. తమకు కావాల్సిన  వాళ్ల గురించి అయితే పుంఖానుపుంఖాలు అనుకూలంగా వార్తలు రాసే తెలుగు మీడియా.. ఒక్క చంద్రబాబు నాయుడును మాత్రం ఏం చేసినా తప్పనే అంటోంది. తాజాగా కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో చంద్రబాబు నాయుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. విజయవాడతో సహా చాలా ప్రాంతాల్లో కృష్ణా నది తీరంలో పుష్కర ఘాట్ లను కనువిందుగా తీర్చిదిద్దారు అయినా కూడా మీడియా మాత్రం తన పైశాచికాన్ని చూపిస్తోంది.

నారా చంద్రబాబు నాయుడు కుటుంబ స‌భ్యులే పుష్క‌ర స్నానానికి రాక‌పోవ‌డం విచిత్రంగా ఉంది అంటూ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. ప్ర‌పంచంలోని ప‌లువురుని పుణ్య స్నానాలంటూ పిలిచిన చంద్ర‌బాబు మ‌రి ఆయ‌న కోడ‌లిని ఎందుకు పిల‌వ‌లేద‌ు అంటూ లేని యక్ష ప్రశ్నలను సంధించింది మీడియా గ‌త ఏడాది గోదావ‌రి పుష్క‌రాల‌కు కూడా లోకేష్ స‌తీమ‌ణి బ్రాహ్మాణీ రాలేదు. అప్ప‌ట్లో కూడా త‌ల్లి, తండ్రుల‌తో క‌లిసి లోకేష్ ఒక్క‌రే స్నాన‌మాచ‌రించారు. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది. అయితే గోదావ‌రి పుష్క‌రాల క‌న్నా ఈసారి పెద్ద సంఖ్య‌లో ఆహ్వాన‌ప‌త్రాల పంపిణీ జ‌రిగిన త‌రుణంలో బ్రాహ్మాణి కూడా వ‌స్తుంద‌ని చాలామంది భావించారు. అయినా ఆమె మాత్రం క‌నిపించ‌లేదు అంటూ ఏమాత్రం పనికిరాని వార్తలను ప్రసారం, ప్రచారం చేస్తున్నాయి.

గోదావరి అంత్య పుష్కరాలను రాజమహేంద్రవరంలో ఎంతో ఘనంగా నిర్వహించిన చంద్రబాబు నాయుడు వీనుల విందుగా, కనులకు ఇంపుగా ఏర్పాట్లు చేశారు. పుష్కరాలు అనగానే గతంలో జరిగిన ఘటనను గుర్తు చేస్తూ వార్తలను ప్రసారం చేస్తున్నారు. సరే చంద్రబాబు నాయుడు సంగతి పక్కన బెడితే తెలంగాణలో జరిగిన కృష్ణా పుష్కరాల తీరును మీడియా ఎక్కడా కూడా తప్పుపట్టలేదు. ఏపి ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల ముందు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు ఏమాత్రం సరిపోవు. మరి దీనిపై మీడియా మాత్రం ఎక్కడా నెగిటివ్ గా వార్త రాలేదు. మరి అదే మీడియా చంద్రబాబును మాత్రం ఏం చేసినా ఎందుకు తప్పుపడుతోంది అనేదే అసలు ప్రశ్న.

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
జీఎస్టీ బిల్ కథ..
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
పట్టిసీమ వరమా..? వృధానా..?
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
ఇక యుద్ధమే కానీ..
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments