తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..

Telugu popular Google Search Persons

తెలుగు రాష్ట్రాల్లో నాయకులు మేమే కింగ్ అంటే.. కాదు కాదు మేం అంతకన్నా గ్రేట్ అంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్నాం కాబట్టి ప్రజలకు మాకే సపోర్ట్ అంటూ ఎవరికి వారే బీరాలకు పోతున్నారు. ఎన్నికల్లో ఎవరిది పైచేయి అని అందరికి తెలిసిందే. కానీ తాజాగా గూగుల్ సెర్చ్ లో ఎవరిది పైచేయి అనేదానిపై కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. మీ పార్టీ నాయకుడు అంతేనా.. మా పార్టీ నాయకుడు ఇంత చూశావా..? అన్నట్లు సాగుతున్న గూగుల్ సెర్చ్ ర్యాంకులపై మీరూ ఓ కన్నేయండి.

గూగుల్ సెర్చ్ లో భాగంగా.. తెలంగాణ యాసకు, భాషకు మునుపెన్నడూ లేనంత గుర్తింపు తెచ్చిన నేతగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొన్నటిదాకా గూగుల్ సెర్చిలో అందరికంటే ముందున్నారు. కానీ తండ్రిని మించిన కొడుకుగా రంగప్రవేశం చేసిన కేటీఆర్ అంతకన్నా ముందున్నాడు. మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన నాటి నుంచి నెటిజన్లు కేసీఆర్ కంటే కేటీఆర్ పేరునే ఎక్కువగా సెర్చి చేస్తున్నారు. తెలంగాణలో టాప్ వన్ లో కేటీఆర్ ఉంటే, టాప్ టూలో కేసీఆర్ ఉండటం విశేషం. కాగా తెలంగాణలో మరే నాయకుడికి కూడా అవకాశం లేకుండా పోయింది.

తెలంగాణలో తండ్రీ, కొడుకులు గూగుల్ లో తమ ప్రతాపాన్ని చాటుతుంటే.. ఏపిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి కంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పాపులారిటీ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు అక్కడ పట్టం కట్టినా కూడా తర్వాత మాత్రం ఆయనకు పాపులారిటీ తగ్గింది. నెటిజన్లు జగన్ గురించి ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తేలింది. జగన్ మాట్లాడిన మాటలు, లేదంటే చేసిన దీక్షలులాంటివి ఆయన మీద గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసేలా చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి జగన్ అండ్ కోకు ఇది చాలా మంచి విషయం. హైటెక్ బాబుగా పేరున్న చంద్రబాబుకు గూగుల్ లో నెటిజన్లు పెద్దగా సెర్చ్ చెయ్యకపోవడం విశేషం.

Related posts:
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
తాగుబోతుల తెలంగాణ!
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
ఏపీ బంద్.. హోదా కోసం
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
బెంగళూరుకు భంగపాటే
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
మోదీ మీద మర్డర్ కేసు!
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
నరేంద్రమోదీ@50 రోజులు
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments