పెడన నుండి పోటు… టిడిపిలో ఇదే చర్చ

TeluguDesamParty fall down starts from Pedana Muncipality

ఏపిలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తున్నది అని అందరికీ తెలుసు. కానీ అధికారంలో ఉండి కూడా ముందు జాగ్రత్తలను పాటించడంలో మాత్రం చంద్రబాబు మరియు తెలుగుదేశం పార్టీ విఫలమైనట్లు కనిపిస్తోంది. అధికారపక్షం చేస్తున్న ప్రతి తప్పును ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో కాకపోయినా పరోక్ష ఎన్నికల్లో అయినా తెలుగుదేశం పార్టీకి ఇప్పటికిప్పుడు దెబ్బపడుతుందని అందరికి తెలిసినా జాగ్రత్తపడలేకపోయారు. మొత్తానికి ఏపిలో తెలుగుదేశానికి మొదటి దెబ్బ పడింది.

కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఎన్నికల్లో, పురపాలక సంఘాలు, విజయవాడ నగర పాలక సంస్థలో టిడిపియే విజయం సాధించింది. కానీ మెజార్టీ ఉన్న పెడన పురపాలక సంఘం పైన మాత్రం టిడిపి లెక్క తప్పింది. అక్కడి స్థానిక ఎమ్మెల్యే, తెలుగుదేశం క్యాడర్ నిర్వాకమో లేదంటే తమ పార్టీకి మెజార్టీ ఉందనే ధీమానో తెలియదు కానీ అదే ధీమాను దెబ్బతీసింది వైసీపీ. గుట్టుచప్పుడు కాకుండా తెలుగుదేశం పార్టీకి పంక్చర్ చేసింది. దాంతో ఈ విషయాన్ని అధినేత చంద్రబాబు నాయుడుకు ఎలా చెప్పాలా..? అని అందరూ జుట్టుపీక్కుంటున్నట్లు సమాచారం.

2014కు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఆధిక్యం సాధించింది. పెడన పురపాలకసంఘంలో మొత్తం 23 వార్డులు ఉన్నాయి. టిడిపికి 12, వైసిపికి 11 వార్డులు దక్కాయి. అప్పట్లో టిడిపి తరపున ఎర్రా శేషగిరిరావు ఛైర్మన్ అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణంగా ఎర్రా శేషగిరిరావు గత ఏడాది మరణించారు. దీంతో ఛైర్మన్ ఎన్నికకు రాష్ర్ట ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఛైర్మన్ మరణంతో మునిసిపాలిటీలో టిడిపికి 11, వైసిపికి 11 మంది కౌన్సిలర్ల బలం ఉంది. అయితే టిడిపి ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు పురపాలక సంఘంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు.

పెడన పురపాలక సంఘంలో ఎన్నిక సమయంలో అంతా రివర్స్ అయింది. టిడిపి తరఫున పదిహేనవ వార్డు నుంచి ఎన్నికైన లంకె స్రవంతి.. వైసిపి ఛైర్మన్ అభ్యర్ధి బండారు ఆనంద ప్రసాద్‌కు మద్దతుగా చెయ్యి ఎత్తారు. ఊహించని పరిణామంతో టిడిపి నేతలు అవాక్కయ్యారు. ఆమెతో సీనియర్ నేతలు సంప్రదింపులు జరపకపోవడం కూడా ఈ సమస్య తెచ్చిందని అంటున్నారు. ఆమె వైసిపికి అనుకూలంగా చేయి ఎత్తగానే.. సమావేశంలోనే ఉన్న ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు స్వయంగా వెళ్లి స్రవంతిని బతిమాలారు. కానీ ఫలితం కనిపించలేదు. చివరకు వైసిపి అభ్యర్ధి బండారు ఆనందప్రసాద్ ఛైర్మన్‌గా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు.

పెడన మున్సిపల్ ఎన్నికల్లో టిడిపికి పడిన దెబ్బను తెలుగుదేశం శ్రేణులు అంత సులువుగా తీసుకకోవడం లేదు. వైసీపీ బలోపేతం కావడానికి తెలుగుదేశం పార్టీ చేతులారా కల్పిస్తున్న అవకాశం అని పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు చూస్తేంటే మాత్రం పెడన నుండే తెలుగుదేశం పార్టీ పతనం మొదలైందని, వైసీపీ తెలుగు దేశం పార్టీకి పోటు పొడవడం మొదలుపెట్టిందని అని విమర్శకులు కొత్త చర్యకు తెర తీస్తున్నారు.

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
పవన్ ను కదిలించిన వినోద్
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
ప్రత్యేక హోదా లాభాలు
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
జగన్ క్రిస్టియన్ కాదా!
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?

Comments

comments