2018లో తెలుగుదేశం ఖాళీ!

TeluguDesamParty will leave empty on 2018

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొరకరాని కొయ్యగా మారారు. వరుస విమర్శలతో చంద్రబాబు సర్కార్ మీద విరుచుకుపడుతున్న ఉండవల్లి తాజాగా 2018లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోంది అని భవిష్య వాణి చెప్పారు. 2018 బడ్జెట్ సమావేశాల తర్వాత ఏపీ రాజకీయాల్లో పలు మార్పులు సంభవిస్తాయని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సమావేశాలు ముగిసిన వెంటనే, టీడీపీ నుంచి చాలా వికెట్లు టపటపా పడిపోతాయని ఆయన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

నారా చంద్ర‌బాబుపై సొంత పార్టీ నేత‌ల్లోనే అసంతృప్తి ఉంద‌ని, 2014 ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని టీడీపీ నేత‌లు ముందే ప‌సిగ‌ట్టార‌ని ఉండవల్లి తెలిపారు. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం చాలా మంది అధికార పార్టీ కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయ‌మ‌ని జోస్యం చెప్పారు. ఓ డూప్ ను తయారు చేసుకుంటే తప్ప ఓటుకు నోటు కేసు నుంచి రేవంత్ రెడ్డి బయటపడలేరని ఉండవల్లి ఎద్దేవా చేశారు. మొత్తానికి చంద్రబాబు సర్కార్ కు 2018లో మూడింది అని మాత్రం ఉండవల్లి తేల్చేశారు. మరి చూడాలి ఉండవల్లి మాటలు ఎంత వరకు నిజమవుతాయో?!

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
సల్మాన్ ఖాన్ నిర్దోషి
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
ఆట ఆడలేమా..?
ఏపీ బంద్.. హోదా కోసం
ముద్రగడ సవాల్
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
వాళ్లను వదిలేదిలేదు
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
ట్రంప్ సంచలన నిర్ణయం
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి

Comments

comments