జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు

ZTerror

దేశంలో భద్రత ఎంత దారుణంగా మారింది అనేదానికి మరో ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. భారత రక్షణను వెక్కిరిస్తూ పఠాన్ కోట్ దాడి తర్వాత మరోసారి రక్షణ వ్యవస్థ డొల్లతనాన్ని వెల్లడించింది పంజాబ్ జైలు నుండి ఉగ్రవాదుల పరారీ. పంజాబ్ లోని న‌భా జైలులోకి నిన్న పోలీసు యూనిఫాంలో 10 మంది దుండ‌గులు వ‌చ్చి వంద రౌండ్ల కాల్పులు జ‌రిపి హ‌ర్మీంద‌ర్ సింగ్‌తో పాటు ఆయ‌న అనుచ‌రుల‌ను విడిపించుకుని తీసుకెళ్లారు. అంతకుముందు హ‌ర్మీంద‌ర్ ఆచూకి చెప్పిన వారికి 25 ల‌క్ష‌లు ప్ర‌క‌టించింది పంజాబ్ ప్ర‌భుత్వం. కాగా తాజాగా హర్మీందర్ సింగ్ ను అరెస్టు చేసినట్లు తెలిసింది.

కాగా నిన్న పంజాబ్ జైలు నుంచి విడిపించుకుపోయిన నిషేధిత ఖ‌లిస్తాన్ లిబ‌రేష‌న్ ఫోర్స్ ఉగ్ర‌వాది హ‌ర్మీంద‌ర్ సింగ్ మింటూను పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. హ‌ర్మీంద‌ర్ సింగ్‌పై కొన్ని ఉగ్ర‌వాద కేసులున్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐతో కూడా సంబంధాలు న‌డిపాడు. పాకిస్తాన్ హ‌ర్మీంద‌ర్ సింగ్‌కు డ‌బ్బులు స‌హాయం చేసేద‌ని ఐఎస్ఐ స‌హాయంతోనే యూర‌ప్‌లో ప‌ర్య‌టించిన‌ట్లు పోలీసులు చెప్పారు. విదేశాల్లో ప‌ర్య‌టించి అక్క‌డ కూడా టెర్ర‌ర్ ప్లాట్స్‌కు ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం.   2008లో దేరా స‌చ్చా సౌదా ఛీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌ను హ‌త‌మార్చేందుకు ప్ర‌య‌త్నం చేసిన కేసులో ప్ర‌ధాన నిందితుడిగా హ‌ర్మీంద‌ర్ సింగ్ ఉన్నాడు. ఆ త‌ర్వాత 2010లో లుధియానాలోని హ‌ల్వారా ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌ను పేల్చేందుకు కుట్ర‌పన్నాడు. 2014లో అరెస్ట‌యిన హ‌ర్మీంద‌ర్ సింగ్ నిన్న జైలునుంచి త‌ప్పించుకున్నాడు. ఢిల్లీ-పంజాబ్ పోలీసులు చేసిన సంయుక్త ఆప‌రేష‌న్‌లో హ‌ర్మీంద‌ర్‌ను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
గుజరాత్ సిఎం రాజీనామా
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
సన్మానం చేయించుకున్న వెంకయ్య
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
రాసలీలల మంత్రి రాజీనామా
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత

Comments

comments