మోదీ హత్యకు కుట్ర… భగ్నం

Terrorists trying to kill Narendra Modi

భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద నిజంగా హత్యకు కుట్ర జరుగుతోందా? గోవా సభలో తనను చంపడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అయినా తాను మాత్రం వెనకడుగు వేసేదిలేదు అని అన్న మాటలు అక్షర సత్యాలు కానున్నాయా? అనే అనుమానాలకు తావిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. తాజాగా మోదీ హత్యకు కుట్ర పన్ని నలుగురు అల్ కాయిదా ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ పోలీసులు. ప్రధాని మోడీ సహా 22 మంది రాజకీయ నాయకుల్నిహత్య చేసేందుకు వీళ్లు ప్లాన్ చేసినట్టు సమాచారం. దాంతో పాటు పలు దేశాల దౌత్యకార్యాలయాలను కూడా టార్గెట్ చేసినట్టు చెబుతున్నారు పోలీస్ ఉన్నతాధికారులు.

తమిళనాడులోని మధురైలో వేర్వేరు చోట్ల దాడిచేసి నలుగురు ఉగ్రవాదుల్ని నిఘా వర్గాలు పట్టుకున్నాయి. మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చెన్నైలో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే సులేమాన్ ఆధ్వర్యంలో ముగ్గరు ఉగ్రవాదులు ‘ది బేస్ మూవ్ మెంట్’ పేరుతో ముఠాగా ఏర్పడి పేలుళ్లకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. మదురైకి చెందిన అబ్బాస్ అలీ, సామ్ సమ్ కరీం రజ, ఆయూబ్ అలీ ఈ ముఠాలో సభ్యులు. ఈ ఏడాది ఏప్రిల్ 7న చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణం, జూన్ 15న కేరళలోని కొల్లం కోర్టు ప్రాంగణం, ఆగస్టు 1న కర్ణాటకలోని మైసూర్ కోర్ట్ ప్రాంగణం, సెప్టెంబర్ 12న నెల్లూరు కోర్టు దగ్గర, ఈ నెల 1న కేరళ మళప్పురం కోర్టు ప్రాంగణంలో పేలుళ్లకు పాల్పడ్డట్టు అధికారులు గుర్తించారు. మైసూర్ పేలుడు కేసును ఎన్ఐఏ హైదరాబాద్ బృందం దర్యాప్తు చేస్తోంది.

మోదీ దేశంలో ఉన్న నల్లడబ్బు మీద చేస్తున్న యుద్ధంలో భాగంగా పెద్దనోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థికవ్యవస్థలో మేజర్ మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా దేశం నగదురహితం(cashless) వైపు అడుగులు వేస్తోంది. అయితే మోదీ నిర్ణయంతో నష్టపోతున్న వారు ఆయనను ప్రాణాలతో విడిచిపెట్టబోరు అని ఆయనకు ముందే తెలుసు. అయితే తాజాగా ఉగ్రవాదులు ఆయన హత్యకు ప్లాన్ చేస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

Related posts:
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
రాజీనామాలు అప్పుడే
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
జగన్ సభలో బాబు సినిమా
తిరిగబడితే తారుమారే
బిచ్చగాళ్లు కావలెను
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
తిరిగిరాని లోకాలకు జయ
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments