బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??

Thane baba cheated a couple who came for children

చీమా చీమా.. ఎందుకు కుట్టావ్ అంటే నా పుట్టలో వేలుపెడితే కుట్టనా అన్నట్లు.. మన వాళ్లు బాబాలను నమ్మడం.. తర్వాత దారుణంగా మోసపోవడం జరుగుతున్నాయి. రోజుకో బాబాగారి వ్యవహారం వార్తల్లో చూస్తున్నా కూడా ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. తాజాగా థానేకు చెందిన ఓ బాబాగారి నిర్వాకం అయ్యగారి అసలు స్వరూపాన్ని బట్టబయలుచేసింది. తనకు పెళ్లై చాలా కాలం అయినా కూడా పిల్లలు కలగకపోవడంతో బాబా దగ్గరికి వెళ్లింది. కానీ ఆ బాబాగారు చెప్పింది విన్నాక ఆమెకు ఫ్యూజులు ఎగిరిపోయాయి.

థానేలోని సర్వర్కర్ నగర్‌కు చెందిన 29 ఏళ్ల మహిళకు చాలా సంవత్సరాల క్రితం పెళ్లయింది. అయితే పెళ్లయి ఇన్నాళ్లయినా పిల్లలు లేకపోవడంతో ఓ బాబా దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకుంది. ఆమెకు తన భర్తతో కలిసి రావాలని సూచించాడు. ఆమె తన భర్తతో కలిసి కొద్దిరోజుల తర్వాత బాబా దగ్గరకు వచ్చింది. అయితే బాబా వారికి ఇచ్చిన సలహాతో దిమ్మతిరిగినంత పనైంది. తన ముందు శృంగారం చేస్తే పిల్లలు పుడతారని చెప్పాడు. పాపం నమ్మిన ఆ జంట అలాగే చేసింది.

కొద్దిసేపటి తర్వాత పూజ చేయాలని బయటికెళ్లాలని భర్తకు సూచించాడు. ఆమెను గదిలో వదిలివెళ్లిన భర్తకు కొద్దిసేపటికి అరుపులు వినిపించాయి. తనతో బాబా సెక్స్ చెయ్యడానికి ప్రయత్నించాడని ఆమె భర్తకు తెలిపింది. పోలీసులకు సమాచారమందించిన ఆ జంట దొంగబాబాను జైలుకు పంపించింది. అయినా బాబాల ముందు సెక్స్ చేస్తే పిల్లలు కలుగుతారని నమ్మడం ఏంటో..? ఒకవేళ పిల్లలు పుట్టక పోతే డాక్టర్ దగ్గరికెళ్లి చూపించుకోవాలి. పిల్లలు ఎప్పటికీ కలగరు అని తేలితే.. అనాధ పిల్లలను దత్తత తీసుకోవడం ఎంతో ఉత్తమం.

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
తాట తీసిన క్రికెటర్ గౌతం గంభీర్
మంత్రుల ఫోన్లు బంద్
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
యుపీలో ఘోర రైలు ప్రమాదం
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...

Comments

comments