ఆ బంగారం ఒక్కటే బంగారమా..?

gold

That gold is not only Gold. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

రియో ఒలంపిక్స్ లో పివి సింధు సిల్వర్ మెడల్ సాధిస్తే మన వాళ్లకు పూనకాలు వచ్చాయి. భారతదేశం గర్వించేలా చేసింది అంటూ హడావిడిగా ప్రకటన చేసేశారు. మరికొంత మంది అయితే ముందుగా అవార్డులు, రివార్డుల జాబితాను చదివేశారు. ఇప్పుడు భారతదేశం గర్వించేలా, కోట్ల మందికి స్పూర్తిని నింపేలా మరియప్పన్ తంగవేలు రియో పారాలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించినా కానీ మన వాళ్లకు మాత్రం అవేవీ పట్టవు. మీడియాలో ఏ వార్త నడిస్తే కేవలం వాటికి మాత్రమే స్పందించే మనలాంటి వాళ్లందరికి మరియప్పన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పివి సింధు సిల్వర్ మెడల్ సాధించిన తర్వాత మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని కోట్లు.. మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్ని కోట్లు అని బీరాలు పలికిన వాళ్లకు పారాలంపిక్స్ లో మన వాళ్లు గోల్డ్ సాధించారని కూడా తెలియదు. తెలిసినా దాని గురించి ప్రస్తావించరు. కాగా మరియప్పన్ ప్రతిభను గుర్తించిన తమిళనాడు ఏకంగా రెండు కోట్ల రూపాయల నజరానాను ప్రకటించింది. జయలలిత ప్రకటన వెన రాజకీయ కారణాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు. కానీ కనీసం ప్రోత్సాహం అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి ఒలంపిక్స్ లో మనం పతకం గెలవకపోతే పరువుపోగొట్టుకుంటాం అనుకున్న వాళ్లకు ఇప్పుడు మన జాతి గర్వించేలా చేసిన వ్యక్తులను ఎందుకు గుర్తించడం లేదో అర్థంకావడం లేదు. మరియప్పన్ లాంటి వ్యక్తులను అందరూ గౌరవించాలని కోరుకుంటున్నాం.

మరియప్పన్ గెలుపు తర్వాత ఎవరు ఎలా స్పందించారంటే..

Related posts:
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం
సిరీస్ టీమిండియా సొంతం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్

Comments

comments