పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..

That Party suspend Chief Minister

సాధారణంగా ఏ పార్టీలో అయినా పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులను తప్పించాలి అంటే ఎంతో ఆలోచించాలి. దాని ప్రభావం పార్టీ మీద, కార్యకర్తల మీద పడకుండా చాలా జాగ్రత్తపడాల్సి వస్తోంది. అయితే తాజాగా ఓ పార్టీ ఏకంగా ముఖ్యమంత్రినే పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అవును మీరు చదువుతున్నది నిజమే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రినే పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఈ పరిణామం ఇప్పుడు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పి.పి.ఏ.) తమ ముఖ్యమంత్రి పెమా ఖండూ, మరో ఆరుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం విశేషం. ఇంతకీ ముఖ్యమంత్రిని పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేస్తారు అని అనుకుంటున్నారా? వారందరూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే కారణంతో సస్పెండ్ చేయబడ్డారు. ఆ రాష్ట్రంలో కొన్ని నెలల క్రితం భాజపా కారణంగా రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆయన 47 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి 5 నెలలు క్రితమే పి.పి.ఏ.లో చేరి జూలై 27న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇంతలోనే సస్పెన్షన్ వేటు ఎదుర్కోవలసి వచ్చింది. కనుక ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా వైదొలగుతారా? తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి వారి సహాయంతో తన పదవిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తారా? అనేది త్వరలోనే తెలుస్తుంది.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
ఆరిపోయే దీపంలా టిడిపి?
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
ప్యాకేజీ కాదు క్యాబేజీ
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
సల్మాన్ ను వదలని కేసులు
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
ఏపీకి ఆ అర్హత లేదా?
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
మోదీ చేసిందంతా తూచ్..
దివీస్ పై జగన్ కన్నెర్ర
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
బినామీలు భయపడే మోదీ ప్లాన్
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
గ్రామీణ బ్యాంకులను ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్

Comments

comments