చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?

Thats why we dont buy china carckers

దీపావళి దగ్గరికొస్తోంది. మన దగ్గర దీపావళి అనగానే టపాసులు పేలాల్సిందే.. దివ్వెలు వెలగాల్సిందే. అయితే ఈసారి మాత్రం మన టపాసులు మాత్రమే కొనమని సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. భారత్ పాక్ ఉద్రిక్తతల తర్వాత చైనా వైఖరిపై భారత్ లో చైరా మీద తీవ్ర వ్యతిరేక ఉంది. చైనా అంటేనే చాలా మందికి కోపం వస్తోంది. అయితే దీనిని ఆధారంగా చేసుకొని సోషల్ మీడియాలో చైనా టపాసులను బహిష్కరించి.. దేశీ టపాసులను ప్రోత్సహించాలని ప్రచారం సాగుతోంది. అయితే దేశీయంగా మన ఉత్పత్తులను పెంచడంతో పాటుగా చైనా ఉత్పత్తులను బహిష్కరించడం ద్వారా పర్యావరణాన్ని కూడా కాపాడండి అంటూ పిలుపునిస్తున్నారు.

Also Read: సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది

చైనా ఉత్పత్తుల వల్ల పర్యావరణానికి ముప్పు కూడా తప్పదు అనే ప్రచారం జోరందుకుంది. దేశీయంగా తయారు చేసే టపాసులు అల్యూమినియం పౌడర్, నైట్రేట్స్ వంటి రసాయనాలు వాడితే చైనా వాటిలో మాత్రం పొటాషియం క్లోరేట్ వంటి ప్రమాదకర రసాయనాలు వాడుతున్నారు. పొటాషియం క్లోరేట్ వినియోగం మన దేశంలో నిషేదం. ఇది పీల్చేగాలిని విషతుల్యం చేస్తుంది. క్యాన్సర్, శ్వాస కోశ, చర్మ సంబంధ వ్యాధులు తలెత్తే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైగా దేశీయ బాణాసంచాతో పోలిస్తే చైనా టపాసుల మోత కూడా ఎక్కువే..పైగా అగ్నిప్రమాదాలకు కూడా కారణమవుతుంది. మొత్తానికి డ్రాగన్ టపాసులను కొనవద్దంటూ ప్రచారం బాగానే జరుగుతోంది. ఫలితంగా చైనా టపాసుల కన్నా మన టపాసుల వైపే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
అతడి అంగమే ప్రాణం కాపాడింది
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
‘స్టే’ కావాలి..?
ఏపీ బంద్.. హోదా కోసం
చెరువుల్లో ఇక చేపలే చేపలు
బాబు బిత్తరపోవాల్సిందే..
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
బాబును వదిలేదిలేదు
రాసలీలల మంత్రి రాజీనామా
దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ పేలుళ్ల బాధితులకు ఉరిశిక్ష
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
డబ్బు మొత్తం నల్లధనం కాదు
యాహూ... మీ ఇంటికే డబ్బులు
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
పాపం.. బాబుగారు వినడంలేదా?
బుల్లెట్ బాబా...అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments