బాబుకు అవకాశం లేదు… కేసీఆర్ కు తిరుగులేదు

There is no chance to chandrababu in ap and KCR will be lagend in telangana

విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓ రాష్ట్రం వెలుగు విరజిమ్ముతుంటే.. మరో రాష్ట్రం మాత్రం చీకట్లో జారుకుంది. తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా కొనసాగుతుండగా, ఏపి మాత్రం లోటుతో నడుస్తోంది. ఇక సిఎంల విషయానికి వస్తే మాత్రం ఏపిలో నారా చంద్రబాబు నాయుడుకు ఎన్నికల టైంలో ఉన్న మెజారిటీలో పావు వంతు కూడా వచ్చే ఎన్నికల్లో రాదు అని చాలా సర్వేలు తేల్చాయి. తెలుగుదేశం పార్టీకి రానురాను మైలేజ్ తగ్గుతుండటంతో చంద్రబాబు నాయుడు సర్కార్ లో భయం పట్టుకుంది. ఏపిలో ప్రభుత్వం మీద ఉన్న అసమ్మతి ఎలా ఉంది అనే దానిపై చంద్రబాబు నాయుడు పలు దర్యాప్తు సంస్థల నుండి, ధర్డ్ పార్టీ సర్వేల్లో కూడా బాబు సర్కార్ కు ఈసారి షాక్ తగనుట్లు వెల్లడైంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం ఎవరికి దక్కుతుంది అనే దానిపై గత కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. ఏపిలో అధికార తెలుగుదేశం పార్టీ షాకిచ్చేలా సర్వే విషయాలను వెల్లడించింది. అధికారం కోసం నాడు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫమవుతున్నట్లు అక్కడి వారు నమ్ముతున్నారు. రైతు రుణ మాఫీ, కాపు ఉద్యమంతో ఏపి సర్కార్ ప్రతిష్ట మసకబారింది. అన్నింటికి మించి ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు సర్కార్ మీద ఏపి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కేవలం 57 సీట్లు మాత్రమే వస్తాయని, 175 సీట్లలో మిలిగిన అన్ని స్థానాల్లో ప్రతిపక్ష వైసీపీ జెండా ఎరుగుతుంది అని సర్వేల్లో తేలింది.

ఏపిలో పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. తెలంగాణ ఏర్పాటులో ఎంతో కీలకంగా వ్యవహరించిన టిఆర్ఎస్ పార్టీకే మరోసారి పట్టంకట్టనున్నారు తెలంగాణ ప్రజానీకం. అభివృద్ధిలో దేశంలోనే టాప్ గా దూసుకెళుతుండటం, అవినీతి మరకలు లేకపోవడం, ప్రజలకు పాదర్శకమైన పాలన అందించడం, ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలు ఇలా అన్నింటిని బేరీజు వేసుకున్నా కానీ టిఆర్ఎస్ కు అధికారం దక్కుతుంది అని తేలిపోయింది. ఇక కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కుతుండగా, ఎంఐఎంకు పాత స్థానాలే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా టిఆర్ఎస్ వన్ సైడ్ విన్ క్లీయర్ గా కనిపిస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు తెలుగు రాష్ట్రాలుగా విడగొట్టిన తర్వాత నుండి ప్రారంభమైన రెండు రాష్ర్టాలు పాలనాపరంగా ఎంతో వైవిధ్యాన్ని కనబరుస్తున్నాయి. తెలంగాణలో ఒక్క వివాదాస్పద అంశం కూడా తెర మీద లేదు. కానీ ఏపిలో మాత్రం చాలా వివాదాలు నానుతున్నాయి. ఓటుకు నోటు కేసు, కాల్ మనీ, అవినీతిలాంటి ఎన్నో అంశాలు రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకువచ్చాయి. అలా మొత్తంగా చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం తెలంగాణలో కేసీఆర్ కు తిరుగులేదని, కానీ ఏపిలో మాత్రం చంద్రబాబు నాయుడుకు మరోసారి అవకాశం అస్సలు లభించదు అని తేలిపోయింది.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
అడకత్తెరలో కేసీఆర్
ఆ అరుపులేంటి..?
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
ఎవరు చాణిక్యులు..?
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
తొక్కితే తాటతీస్తారు
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
జయను ఎందుకు ఖననం చేశారంటే?
జయ మరణం వెనక ఆ మాఫియా?

Comments

comments