పవర్ లేని పవర్ ?

There is no power in Pawan Kalyan

దాదాపుగా ఆ పార్టీ తెలంగాణలో జెండా పీకేసి.. ఏపిలో జెండా పెట్టేందుకు సిద్దమైంది. కానీ పోయే మంగళం ఊరికే పోకుండా చివర్లో అందరికి ఆశ్చర్యాన్ని కలిగించిపోయారు. ఇంతకీ మ్యాటర్ ఏంటీ అంటే ఏపిలో పాగా వేసేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ తెలంగాణాలో జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులు కొందరిని నియమించారు. తెలంగాణా జనసేన పార్టీ ఇన్-చార్జ్ గా నేమూరి శంకర్ గౌడ్, తెలంగాణా రాజకీయ కార్యక్రమాల సమన్వయ కర్తగా మహేందర్ రెడ్డిని నియమించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రాప్రదేశ్ లో తన పార్టీ నిర్మాణం చేసుకొంటారని అందరూ భావిస్తున్న సమయంలో తెలంగాణాలో పార్టీ నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టడం చాలా విచిత్రంగానే ఉంది. తెలంగాణాలో కూడా పవన్ కళ్యాణ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. కానీ వారు జనసేనకి అండగా నిలుస్తారా? అనేదే సందేహం. పవన్ కళ్యాణ్ చర్య తెరాసకి పెద్ద షాక్ అవుతుంది. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలని అన్నిటినీ ఫిరాయింపులతో పూర్తిగా బలహీనపరిచి రాష్ట్రంలో తెరాసకి ఇక ఎదురేలేదని భావిస్తుంటే పవన్ కళ్యాణ్ సవాల్ విసరడానికి సిద్దమవుతున్నారు. కనుక త్వరలోనే తెరాస నుంచి పవన్ కళ్యాణ్ కి గట్టి జవాబే రావచ్చు.

అయినా పవన్ ఇప్పటికే ఏపి కోసం అని ప్రత్యేక హోదా గానం ఎత్తుకున్నారు కాబట్టి తెలంగాణలో ఎంత మాత్రం ఆదరణ లభించదు అనే టాక్ నడుస్తోంది..గతంలో ఎన్నికల టైంలో పవన్ కల్యాణ్ చేసిన ప్రచారం మీద తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఘాటుగా స్పందించింది. తెలంగాణ సిఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత ఎన్నికల టైంలో పగటి వేషగాళ్లు రంగులు పూసుకుని వచ్చి, ఎన్నికలు ముగియగానే ప్యాకప్ చెప్పి వెళ్లిపోతారు అని గట్టిగానే నిలదీశారు. ఇక కేసీఆర్ అయితే కనీసం పవన్ పార్టీని పట్టించుకోవడంలేదు. ఇక ఇక్కడ సామాజిక వర్గం పరంగా కానీ, ఆయనకున్న స్టార్ డమ్ ఆదారంగా కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. అయినా కూడా పవన్ ఆశ వదలకుండా తెలంగాణలో కూడా పార్టీని ప్రకటించేశారు.

Related posts:
అమావాస్య చంద్రుడు
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
అమిత్ షా రేస్ లో... తుస్
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
నయిం కేసులో పెద్ద తలకాయలు
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం

Comments

comments