చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్

There is no voting and Discussion on AP Special Status

There is no voting and Discussion on AP Special Status. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ తో వచ్చిన కేవీపీ ప్రైవేట్ బిల్ కు మోక్షం కలగకుండానే పార్లమెంట్ సోమవారానికి వాయిదా పడింది. పాపం ఏపి ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు ఈ బిల్లు మీద చాలా ఆశలతో ఉన్నా కానీ కనీసం పార్లమెంట్ లో దీనిపై ఎలాంటి డిస్కషన్, ఓటింగ్ రాకపోవడంతో కాంగ్రెస్, వైసీపీ నాయకులు తీవ్ర నిరాశగా ఉన్నారు.  లోక్ సభలో వీడియో తీసిన ఆప్ ఎంపీపై చర్య తీసుకోవాలని చైర్మన్ పోడియాన్ని బీజేపీ సభ్యులు చుట్టుముట్టి నినాదాలు చేశారు. బిల్లుపై చర్చ చేపట్టాలని, ఓటింగ్ జరపాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇరుపక్షాల వాదనలతో సభ గందరగోళంగా మారింది. డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎంత నచ్చజెప్పినా సభ్యులు శాంతించలేదు. దీంతో, రాజ్యసభను సోమవారానికి వాయిదా వేశారు. బిల్లుని అధికార పక్షం సభ్యులు కావాలనే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

ఏపికి ప్రత్యేక హోదా బిల్ కోసమే తన షూటింగ్ ను ఆపేసి మరీ దిల్లీకి వెళ్లిన చిరంజీవికి తీవ్ర నిరాశే ఎదురైంది. దాంతో ఆయన మీడియా ముందు చంద్రబాబుపై, బిజెపిపై విమర్శలకు దిగారు. ప్రత్యేక హోదాపై తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా ఉందని చిరంజీవి అన్నారు. కేవీపీ బిల్లు ఎప్పటికైనా ఓటింగుకు రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లుకు బీజేపీ వ్యతిరేకంగా ఓటు వేస్తే ఏపీలో ఆ పార్టీ మనుగడ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. బిల్లును అడ్డుకోవడానికి బీజేపీ అనేక వంకలు పెడుతోందన్నారు. ఏపీలో బీజేపీ బతికి బట్ట కట్టాలంటే మద్దతివ్వాల్సిందే అన్నారు.

Related posts:
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
సన్మానం చేయించుకున్న వెంకయ్య
జియోకే షాకిచ్చే ఆఫర్లు
మహిళలకు వైయస్ ప్రోత్సాహం.. గుర్తుచేసుకున్న నన్నపనేని
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
ఏపీకి ఆ అర్హత లేదా?
అకౌంట్లో పదివేలు వస్తాయా?
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
జయ మరణం ముందే తెలుసా?
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
పాపం.. బాబుగారు వినడంలేదా?
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments