మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే

They Are Irrirated With Name Of Narendra Modi

చెప్పేవి సారంగ నీతులు… దూరేవి దొమ్మరి గుడిసెలు అన్నట్లుంది మోదీ పరిస్థితి.జనాలకు స్పీచ్ ఇమ్మంటే గంటల తరబడి నిరాటంకంగా మాటల తూటాలు పేల్చే మోదీ.. మాటల మనిషిని కాదు.. చేతల మనిషిని అని ఎన్నోసార్లు తనకు తాను ప్రకటించుకున్నాడు. మరి అలాంటి మోదీ కేవలం మాటల మాయావి అని ఓ గ్రామ ప్రజలు గట్టిగా వాదిస్తున్నారు. అదేంటి దేశం మొత్తం మెచ్చుకుంటున్న మోదీ గురించి వాళ్లు ఎందుకు అలా అనుకుంటున్నారు.? అనేగా డౌట్. ఎందుకంటే మోదీ వాళ్లకు ఏమీ చెయ్యడం లేదు కాబట్టి.

ప్రధాని నరేంద్ర మోదీ నియోజక వర్గం వారణాసికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగేపూర్ గ్రామవాసులను మోదీ గురించి అడిగితే విసుక్కునే పరిస్థితి తలెత్తింది. నాగేపూర్ ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని దళిత గ్రామమిది. ఈ గ్రామానికో విశిష్టత ఉంది. నాగేపూర్ మోడీ దత్తత తీసుకున్న రెండో గ్రామం. సాక్షాత్తు ప్రధానమంత్రే దత్తత తీసుకున్నారంటే ఆ గ్రామానికి ఇక తిరుగేలేదనుకుంటారు. రోడ్లు మెరిసిపోతాయ్.. కొత్త కొత్త భవంతులు కడతారు. పేదరికం పారిపోతుంది. ఇక అందరి జీవితాల్లో వెలుగులే.. ఇలా ఎన్నో అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్… దత్తత గ్రామంగా ప్రకటించి రెండేళ్లైనా.. ఇక్కడ ప్రధాని బహుమతిగా ఇచ్చిన అంబేద్కర్ విగ్రహం తప్ప మరొకటి కనపడటం లేదు.

దేశ ప్రధాని అందునా మోదీ తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ది ఉరకలు వేస్తుంది అనుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది. నిత్యం స్వచ్ఛ భారత్ అని గొంతు చించుకునే మోదీ.. తన దత్తత గ్రామంలో కనీసం మరుగుదొడ్ల నిర్మాణాన్ని కూడా చేపట్టలేదు. మోదీ ఆశల పథకం సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకాన్ని 2014లో ప్రవేశపెట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ఎంతో మంది సినీ స్టార్లు, వ్యాపారవేత్తలు, స్పోర్ట్స్ స్టార్లు ప్రధాని పిలుపుకు స్పందించారు. కానీ ఆయన మాత్రం ప్రకటనలకే పరిమితమయ్యారనే విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.

పక్కవాడికి నీతులు చెప్పే ముందు మన తప్పులు లేకుండా చూసుకోవాలి అన్న చిన్న లాజిక్ ను మోదీ మిస్ అయినట్లు కనిపిస్తోంది. మోదీ విదేశాల్లో విజయవంతంగా పర్యటనలు చేస్తుండవచ్చు.. విదేశాల నుండి వేల కోట్లను పెట్టుబడులుగా తీసుకువస్తుండవచ్చు. కానీ తాను దత్తత తీసుకున్న గ్రామానికి మాత్రం మంచి చెయ్యలేదు అంటే మాత్రం అది ఎవరికి నచ్చదు. అందరికి ఆదర్శంగా నిలవాల్సిన మోదీ ఇలా తన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంటే మిగిలిన వాళ్లు ఎలా స్పందిస్తారు అనేది కూడా చూడాలి. మొత్తానికి నాగేపూర్ వాసులు మోదీ తమకు అరచేతిలో చుక్కలు చూపించి.. మాయ చేశాడని అంటున్నారు.

Related posts:
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
సింధూరంలో రాజకీయం
చంద్రుడి మాయ Diversion Master
టాప్ గేర్ లో ముద్రగడ
మద్యల నీ గోలేంది..?
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
ప్రత్యేక హోదా లాభాలు
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?

Comments

comments