తాగుబోతుల తెలంగాణ!

They are making alcoholics Telangana

బంగారు తెలంగాణను సాధించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు వెళుతోంది అని కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు. మొన్నీమధ్యన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు గడిచిన సందర్భంగా కూడా బంగారు తెలంగాణదిశగా అడుగులుపడుతున్నాయి అని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. కానీ త్యాగాల తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెల్లిందని మండిపడుతున్నారు ఓ తెలంగాణ తెలుగుదేశం నాయకుడు విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడిన విధానం వింటే ఆయన మాటలల్లో నిజం ఉందికదా అని మీకు కూడా అనిపిస్తుంది.

త్యాగాల తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెల్లిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నరిసిరెడ్డి మండిపడ్డారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన చిన్నారి రమ్య ఇష్యూను మరచిపోయేలా చేయటానికే మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటనలు చేపట్టినట్లుగా ఆయన విమర్శించారు. అర్థరాత్రి ఆకస్మిక పర్యటనలు.. బార్ల మీద దాడులు.. మైనర్ల అరెస్ట్ లు లాంటివన్నీ ప్రచారం కోసమే తప్పించి మరొకటి కావని ఆరోపించారు. ప్రాంతాల వారీగా లక్ష్యాలు పెట్టి మరీ మందును అమ్మిస్తున్న తెలంగాణ సర్కారు ఈ రోజు రూల్స్ గురించి మాట్లాడటం ఏమిటంటూ ప్రశ్నించారు. ఓవైపు అర్థరాత్రి వరకూ మద్యం అమ్మకాలకు అనుమతులు ఇస్తూనే.. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతూ.. రెండు వైపులా ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆదాయానికి లక్ష్యాలు పెట్టి.. అవి సాధించిన అధికారులకు సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై కేసులు పెడుతోందని మండిపడ్డారు. నరసిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts:
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
మా టీవీ లైసెన్స్ లు రద్దు
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
కాశ్మీర్ భారత్‌లో భాగమే
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
సల్మాన్ ను వదలని కేసులు
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
మంత్రుల ఫోన్లు బంద్
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ

Comments

comments