ఏం పీకలేకపోతున్నారు… ఎందుకు ఇలా?

They are not demolishing those constructions in GHMC

ఈ టైటిల్ చూసిన వెంటనే ఇదేదో బూతు అని అనుకోకండి. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి సరిపోయే వ్యాఖ్య. తెలంగాణ సర్కార్ పరిస్థితి గురించి బయట కొంత మంది వ్యక్తులు అంటున్న మాట ఇది. అదేంటి తెలంగాణ సర్కార్ గురించి అలా ఎందుకు అనుకుంటున్నారు..? ఎవరు అనుకుంటున్నారు..? అనేగా మీ డౌట్. మీ అన్ని డౌట్ లకు సమాధానం ఈ ఆర్టికల్ లో దొరుకుతుంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో  గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాల కారణంగా నగరం మొత్తం నీళ్లలో మునిగిపోయింది. కాలనీలు అన్నీ కూడా చెరువులను తలపించాయి.

హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కార్ మీద విమర్శల వర్షం కూడా కురిసింది. దాంతో పరిస్థితిని అడ్డుకోవడానికి తెలంగాణ సర్కార్ వెంటనే అక్రమ నిర్మాణాలను కూల్చివెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను  కూల్చివేస్తామని, అలాంటి నిర్మాణాలు ఏ వ్యక్తివి అయినా కూడా కూల్చడం మాత్రం ఖాయం అంటూ ఘాటుగా ప్రకటన చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎవరు అడ్డుతగిలినా కానీ ఆపబోమని, వందకు వంద శాతం అక్రమ కట్టడాలను కూల్చడం ఖాయం అని కుండబద్దలు కొట్టారు.

కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజు నుండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వాళ్లు రంగంలోకి దిగారు. నాళాల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివెయ్యడం ప్రారంభమైంది. కేటీఆర్ ఆ కూల్చివేతల ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేటీఆర్, జిహెచ్ఎంసీ కమీషనర్, గ్రేటర్ మేయర్ లు దగ్గరుండి ఈ అక్రమ కట్టడాల కూల్చివేతను పరిశీలించారు. కానీ జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు కేవలం ఆరంభ శూరత్వం మాత్రమే అని తేలింది. అధికార పార్టీకి చెందిన, అర్దబలమున్న బడా బాబులకు విషయానికి వస్తే మాత్రం అడుగు ముందుకుపడటం లేదు అని తెలుస్తోంది.

జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతకు పూనుకుంటే మామూలు జనాలు కూడా దానికి మద్దతు పలికారు. ఎంతో మంది కేసీఆర్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ అధికారులు చేస్తున్న నిర్వాకం మీద మండిపడుతున్నారు. బడాబాబులు, రాజకీయ అండదండలున్న వారి అక్రమ కట్టడాలను కూల్చడం లేదని.. ఏం పీకలేకపోతున్నారని అందరూ చర్చించుంటున్నారు. అక్రమ నిర్మాణాలే అయినా కూడా వాటిని కూల్చడానికి ప్రయత్నించిన అధికారులకు క్షణాల మీద ఫోన్ లు రావడం జరుగుతోందని చాలా మంది అభిప్రాయం. అక్రమ కట్టడాలు ఉన్న బడాబాబులను మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు కనీసం కదల్చలేకపోతున్నారని, అధికారులు వత్తిళ్లకు తలొగ్గుతున్నారని ఈనాడులో కథనం కూడా ప్రచురించారు.

eenadu-article

కోర్టు కేసులు ఉన్నా కూడా వాటి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.. కానీ అక్రమ కట్టడాల కూల్చివేత మాత్రం కొనసాగుతుంది అని కేసీఆర్ ఆవేశంగా చేసిన ప్రకటన మీద ఇప్పుడు జనాలు మండిపడుతున్నారు. వీలైతే ఉన్నతాధికారుల నుండి, రాజకీయ నాయకుల నుండి ఫోన్లు చేయించి కూల్చివేతలను అడ్డుకుంటున్నారు బడాబాబులు. మరి తెలంగాణ సర్కార్ చేసిన వ్యాఖ్యలు అని కేవలం ప్రగల్భాలని, పేదల విషయంలో కర్కషంగా వ్యవహరించే జిహెచ్ఎంసీ అధికారులు పెద్దల విషయంలో మాత్రం ఏమీ పీకలేకపోతున్నారని మండిపడుతున్నారు. మరి దీని మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts:
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
జీఎస్టీ బిల్ కథ..
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
పవన్ చంద్రుడి చక్రమే
ఆ అరుపులేంటి..?
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
ఎవరు చాణిక్యులు..?
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?

Comments

comments