ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?

They destroyed Worl But not India

ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్న భారతదేశానికి ఉన్న గుర్తింపు వేరే. వేల సంవత్సరాల ప్రపంచ చరిత్రలో మన దేశ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు భారత్ అంటే మామూలు దేశం కాదు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో ఒకటి. అందుకే దీని అందరి కన్నా ప్రత్యేక స్థానం ఉంది. ఇక ప్రపంచంలో చాలా దేశాలు యుద్దంతో వణికిపోతున్నాయి. యుద్దం అంటే కేవలం మనుషులు మాత్రమే చేసేది అనే ఓ భావన మొన్నటి దాకా ఉండేది. కానీ మెషీన్స్, ఏలియన్స్ కూడా యుద్దం చేస్తాయని సినిమాల ద్వారా తెలిసింది.

చాలా సినిమాల్లో ఎంతో కొంత ఇండియా పార్ట్ వచ్చేటట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని వాళ్లు అలా చేస్తుంటారు. హాలీవుడ్ సినిమాల్లో ఇండియన్ యాక్టర్లను పెట్టుకొని కోట్లు సంపాదిస్తున్నారు. కాగా తాజాగా విడుదలకు సిద్దంగా ఉన్న ఓ సినిమా గురించి ఇంట్రస్టింగ్ పాయింట్ తెలిసింది. ఇరవైయేళ్ల క్రితం ఇండిపెండెన్స్ డే పేరుతో వచ్చిన సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు అదే సిరీస్ లో ఇండిపెండెన్స్ డే రిసర్జెన్స్ త్వరలోనే ధియేటర్లలో సందడి చేయనుంది.

ప్రపంచాన్ని ఏలియన్స్ తమ టెక్నాలజీతో ఎలా నాశనం చేస్తాయి అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీస్తున్నారు. కాగా ఈ సినిమాలో ప్రపంచం నాశనం అయ్యే సీన్లు చాలా ఉన్నాయి. అలాంటి సీన్లలో ఎక్కడా కూడా ఇండియాకు సంబందించిన సీన్లు చెయ్యలేదని తెలిసింది. అంటే ప్రపంచం మొత్తం నాశనం అయ్యే సీన్లను చూపించినా కూడా ఎక్కడా.. ఇండియా నాశనం అవుతున్న సీన్లు మాత్రం ఈ సినిమాలో లేవట. అలా ఎందుకు చేశారు.. అని సినిమా టీంను అడిగితే వాళ్లు చెప్పిన సమాధానం అందరికి ఆలోచనలో పడేసింది.

ఇండియాలో సినిమాలు అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలుసు. కానీ సినిమాల్లో ఇలాంటి నాశనం చేస్తున్న సీన్లలో ఎంతో చరిత్ర ఉన్న కట్టడాలను చూపించడం కరెక్ట్ కాదని సినిమా యూనిట్ అనుకుందట. అలా ఎందుకు అంటే ఇక్కడ ఉండే వాళ్లు చాలా సెంటిమెంటల్.. వాళ్లు పలానా దాన్ని అందంగా చూడడానికి మాత్రమే ఇష్టపడతారు.. అలా కాదని వేరేలా చూపిస్తే వాళ్లు దాన్ని అంగీకరించరు అని అన్నారు. పైగా ఇండియాలో మార్కెట్ చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇండియాకు సంబందించి ఎలాంటి సీన్లు పెట్టలేదు అని అన్నారు.

2012, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, అవతార్, అవెంజర్స్, జంగిల్ బుక్, లైఫ్ ఆఫ్ పై, కంజూరింగ్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో హాలీవుడ్ సినిమాల్లో ఏమాత్రం అభ్యంతరకర సీన్లు ఉన్నా దాని ప్రభావం మార్కెట్ మీద ఉంటుంది. అన్నింటికి మించి ఈ మధ్యన సెన్సార్ బోర్డ్ కూడా ఎక్కవ కత్తెరలు వేస్తోంది. స్పెక్ట్రె సినిమాలో కిస్సింగ్ సీన్ల మీద సెన్సార్ బోర్డ్ కట్ చెప్పింది. సో అన్నింటిని లెక్కలోకి తీసుకొని సాఫ్ట్ గా దీన్ని డీల్ చేసినట్లు తెలుస్తోంది.

-Abhinavachary

Related posts:
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
బాబోయ్ బాబు వదల్లేదట
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
అంత దైర్యం ఎక్కడిది..?
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
బాబు గారి అతి తెలివి
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
మావో నాయకుడు ఆర్కే క్షేమం
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
BSNL లాభం ఎంతో తెలుసా?
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
బాబును వదిలేదిలేదు
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?

Comments

comments