ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు

They fearing about that bald head

నిండుకుండ కన్నా అరకుండకు ఆటుపోటులు ఎక్కువ అనే నానుడి వినే ఉంటారు. అలాగే మామూలు జట్టుకన్నా.. బట్టతలకు భారీగా ఖర్చు అవుతోంది. అలాగే ఓ పెద్దాయన కటింగ్ ఖర్చు మీద ఏకంగా దేశం మొత్తం చర్చించుకుంటున్నారు. అవును ఆయన కటింగ్ గురిచి అంతగా చర్చించడానికి ఏముంటుంది అనుకుంటున్నారేమో.. ఆ కటింగ్ విలువ అక్షరాల ఏడున్నర లక్షలు. అవును ఏడున్నర లక్షలు పెట్టి కటింగ్ చేసుకుంటే అందరూ చర్చించుకోరా ఏంటి. పైగా ఆయన కటింగ్ ఖర్చు ఆ  దేశ ఖజానాకి భారీ గండి కొడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఓ దేశ ప్రజలను కలవరపెడుతున్న ఆ బట్టతల ఎవరిదో తెలుసా.?

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్. ఈయన తన జుట్టు సంరక్షణ, నిర్వహణ కోసం నెలకు 9,895 యూరోలు అంటే దాదాపు మన రూపాయల్లో చెప్పాలంటే ఏడున్నర లక్షలన్నమాట… అవును, అక్షరాలా ఏడున్నర లక్షల రూపాయలు. 2017 అధ్యక్ష ఎన్నికల్లో బట్టతల ఉన్న వారినే ఎన్నుకుంటే ఖజానాకు చాలా ఖర్చు మిగిలిపోతుందని కొందరు… ప్రజాధనం ఆదా అవుతుందని మరికొందరు ఏకంగా జోకులు కూడా వేసుకుంటున్నారు. మొత్తానికి ఓ దేశాధ్యక్షుడి బట్టతల ప్రజలకు చెమటలు పట్టిస్తోంది.

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
అతడికి గూగుల్ అంటే కోపం
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
సదావర్తి సత్రం షాకిచ్చింది
సౌదీలో యువరాజుకు ఉరి
జగన్ సభలో బాబు సినిమా
నారా వారి అతి తెలివి
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
అకౌంట్లలోకి 21వేల కోట్లు
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?

Comments

comments