వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు

They Will Get More salary than MPs

కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అందరిని కాకపోయినా కొంత మందిని మాత్రం సంతోషపెడుతుంది. మన వాళ్లు జీతాల మీద ఎంత చిత్తశుద్దిని ప్రదర్శిస్తారో అందరికి తెలుసు. పార్లమెంట్ లో తమ జీతాల పెంపులో ఎంపీలు చూపించిన ఐక్యత అందరికి తెలసు. కానీ తాజాగా వాళ్లను మించిన జీతాలు అందుకోనున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు. తాజాగా ఏడో పిఆర్ఎసి సిఫార్సులకు కేంద్రం ఓకే చెయ్యడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా లాభం చేకూరనుంది.

కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం కలిగేలా బేసిక్‌ను 16 శాతం పెంచేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్రమంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2016 జనవరి 1 నుంచి వేతన సవరణ పెంపుదల వర్తిస్తుంది. ఆర్మీ సిబ్బంది భత్యాన్ని రూ.21 వేల నుంచి 31,500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేతనాలు పెరుగుదల ఇలా.. దాదాపు కోటిమంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఆదాయం సగటున 23.5శాతం పెరగనుంది. జీతాలు కనిష్టంగా 20 శాతం. గరిష్ఠంగా 25 శాతం వరకు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ఖజానాపై రూ.1.02 లక్షల కోట్ల అదనపు భారం పడనుంది.

50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేరుగా దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ పికె సిన్హా నేతృత్వంలోని ప్యానెల్‌ జస్టిస్‌ ఏకే మాథుర్‌ ఆధ్వర్యంలో ఓ పరిశీలన సంఘాన్ని నియమించారు. ఆ సంఘం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. దీనిలో జీతం, అలవెన్స్‌లు, పింఛనుల్లో 23.55శాతం పెంపును ఇవ్వాలని, మూల వేతనం దాదాపు పదిహేను శాతం పెంచాలని సూచించింది. వేతన పెంపుకు రూ.39,100 కోట్లు, అలవెన్స్‌లకు రూ.29,300 కోట్లు, పింఛన్ల రూపంలో రూ.33,700 కోట్లు కేటాయించారు. వీటిల్లో కేంద్ర బడ్జెట్‌ నుంచి రూ.73,650 కోట్లు, రైల్వేల నుంచి 28,450 కోట్లు రానున్నాయి. ప్రస్తుతం కేబినెట్‌ సెక్రటరీ ర్యాంకు ఉద్యోగులకు రూ.2,50,000 వేతనం లభించనుంది. దీంతోపాటు ప్రస్తుతం రూ.90,000 అందుకుంటున్న ఎంతోమంది సీనియర్‌ ప్రభుత్వ ఉద్యోగుల వేతనం ఈ పెంపుతో ఎంపీల కంటే ఎక్కువ కానుంది. ఎంపీల వేతనం పెంపునూ పరిశీలిస్తోంది.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
ఆయనకు వంద మంది భార్యలు
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
గుజరాత్ సిఎం రాజీనామా
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
జయ మరణం ముందే తెలుసా?
వంద విలువ తెలిసొచ్చిందట!
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
బస్సుల కోసం బుస్..బుస్
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

Comments

comments