బిచ్చగాళ్లందు… ఈ బిచ్చగాళ్లు వేరయా!

This Hyderabad Beggars are so different

వేమన.. పురుషులందు పుణ్య పురుషులు వేరయా.. అంటే హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ మాత్రం బిచ్చగాళ్లందు ఆ బిచ్చగాళ్లు వేరయా అంటున్నారు. మామూలుగా బిచ్చగాళ్లు అంటే ఏ సిగ్నల్ దగ్గరో లేదంటే గుడి దగ్గరో తినడానికి తిండిదొరక్క, వేసుకోవడానికి బట్టలులేని వాళ్లు అని అందరికి ఓ ఫీలింగ్ ఉంది. అందుకే ఎవరు కనిపించినా.. ఆ టైంలో జేబులో చిల్లర ఉంటే చాలు వెంటనే తీసి వాళ్లకు భిక్ష వేస్తుంటాం. మరి అలాంటి బిచ్చగాళ్ల గురించి మేయర్ బొంతు గారు మాత్రం అలా ఎందుకు అన్నారు అనుకుంటున్నారా..? దానికి కారణాలున్నాయి.

గతంలో రెండు మూడు సినిమాల్లో బిచ్చగాళ్లు చేసే మోసం గురించి.. వారి వెనక ఉండే మాఫియా గురించి చూపించారు. అందులో ఓ మాఫియా అందరిని కోఆర్డినేట్ చేస్తూ.. వారి దగ్గరి నుండి వచ్చిన కలెక్షన్లను దోచుకుంటుంది. అలా సినిమాల్లో మాదిరిగా కాకున్నా హైదరాబాద్ లో ప్రస్తుతం భిక్షాటన చేస్తున్న వారిలో దాదాపుగా 98శాతం మంది నకిలీ బిచ్చగాళ్లే ఉన్నారని ఓ స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలిందని మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. కేవలం రెండు శాతం మంది మాత్రమే నిజమైన బిచ్చగాళ్లని.. వారు మాత్రమే తమ కోసం అడుకుంటున్నారని అంటున్నారు.

సరే.. మరి మిగిలిన తొంభై ఎనిమిది శాతం నకిలీల పరిస్థితి ఏంటో తెలిస్తే షాకవుతారు. హైదరాబాద్ లోబిచ్చగాళ్లు నెలకు సంపాదించే మొత్తం రెండు కోట్ల రూపాయలట. అవును నెలకు మొత్తం బిచ్చగాళ్ల సంపాదన లెక్కిస్తే అది రెండు కోట్ల రూపాయలు. ఈ లెక్కన సంవత్సరానికి 12 కోట్ల రూపాయలు. ఏంటి షాక్ తగిలిందా..? మనం వేసే చిల్లర డబ్బులే పెరిగి పెరిగి ఏకంగా కోట్ల రూపాయలకు పాకాయి అంటే పరిస్థితి ఎంత రాయల్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్నటి దాకా తిరుమల తిరుపతిలో ఉంటున్న బిక్షగాళ్లు కోట్లకు పడగెత్తారు.. ముంబైలో భిక్షగాళ్లు అపార్ట్ మెంట్లకు ఓనర్లయ్యారు అనే వార్తలు విన్నాం. కానీ మన దగ్గర కూడా కోట్ల రూపాయలు భిక్షగాళ్ల వల్ల చేతులు మారుతున్నాయి అంటే షాక్ తినాల్సిందే.

అందుకే దీన్ని గమనించిన బొంతు రామ్మోహన్ గారు.. హైదరాబాద్ ను బెగ్గర్ ఫ్రీగా చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు. అందులో భాగంగా స్వచ్చంద సంస్థలతో ఓ సమావేశాన్ని నిర్వహించి దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి హైదరాబాద్ బెగ్గర్స్ కూడా ఓ లెవల్ లో సంపాదిస్తున్నారు అన్న విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది.. కానీ హైదరాబాద్ ను బెగ్గర్ ఫ్రీగా చేస్తామని చెప్పడంలోనే ఎక్కడో తేడా కనిపిస్తోంది. అది అసలు సాధ్యమేనా అని అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. చూడాలి మరి బొంతు రామ్మోహన్ గారు అనుకున్నది సాధిస్తారా..?

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
గుజరాత్ సిఎం రాజీనామా
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
‘స్టే’ కావాలి..?
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
జియోకే షాకిచ్చే ఆఫర్లు
కాశ్మీర్ భారత్‌లో భాగమే
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
సౌదీలో యువరాజుకు ఉరి
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?

Comments

comments