హరీష్.. ఇది నీకు సరికాదు

This is not fair for Telangana Minister Harish Rao

మల్లన్న సాగర్ మీద తెలంగాణలో రగడ సాగుతోంది. ఇదే ప్రాజెక్టుకు చెందిన నిర్వాసితులకు వెంటనే న్యాయం చెయ్యాలని ముంపు గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించాలని గతకొంత కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. అయితే దీని మీద స్పందించిన టిడిపి, బిజెపి, జెఎసి నాయకులు అక్కడి మీటింగ్ లకు హాజరై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇక్కడి నుండే జెఎసి చైర్మెన్ కోదండరాం ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టిడిపి నాయకుడు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, హరీష్ రావు మీద చిందులు వేశారు.

కాగా తాజాగా తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు దీని మీద స్పందించిన తీరు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హరీష్ రావు మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి తప్పులేదు. కానీ దీనికి వ్యతిరేకంగా, ప్రభుత్వం మీద శక్తులను ఏకం చేస్తున్న జెఎసి పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం సరికాదు.ఇక్కడ టిడిపి, బిజెపిలు స్పందిస్తున్నతీరు వేరు. జెఎసి స్పందిస్తున్న తీరు వేరే అని గమనించాలి. పార్టీలు కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఎక్కువగా పనిచేస్తాయి కానీ జెఎసి అలా కాదు కదా.. కేవలం ప్రజాపక్షమే పని చేస్తుంది. మరి అలాంటి జెఎసిని కూడా ఊర్లలోకి రానివ్వద్దు అని అనడం హరీష్ లాంటి వ్యక్తి చెయ్యాల్సిన వ్యాఖ్యలు కావు.

టిడిపి, బిజెపి, జెఎసి నాయకులను ఊర్లలోకి రానివ్వద్దు.. వాళ్లు మల్లన్న సాగర్ మీద లేనిపోని ప్రచారం చేస్తున్నారు అని హరీష్ అన్నారు. మెదక్ లోని చాలా నగరాల్లో దీని మీద రైతులు ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. వెంటనే మల్లన్న సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలని రైతులు, కూలీలు టిడిపి, బిజెపిలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసేంత వరకు పరిస్థితి వెళ్లింది అని ఆయన అన్నారు. అంతా బాగానే ఉన్నా మల్లన్న ప్రాజెక్టు ముంపు బాధితులకు న్యాయం చెయ్యాల్సిన అవసరం ఉంది అన్న మాట వాస్తవం.పైగా సిద్దిపేట, మెదక్ లకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టే ప్రభుత్వం ప్రత్యేకంగా దీని మీద దృష్టిసారించింది అన్నది కూడా నిజం.

Related posts:
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
బాబు బిత్తరపోవాల్సిందే..
అడవిలో కలకలం
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే

Comments

comments