జీఎస్టీ బిల్ కథ..

This is the GST bill history which very hot in Parliament sessions

పార్లమెంట్ ఆవరణలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదం జీఎస్టీ. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(Goods and Service Tax-వస్తు, సేవల పన్ను). ఈ బిల్ ఆమోదం పొందితే కానీ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడదు అని మోదీ సర్కార్ గట్టిగా నమ్ముతోంది. ఇంతలా మోదీ సర్కార్ నమ్మిన జీఎస్టీ అంటే ఏమిటి..? దానికి అంత ప్రాధాన్యత ఏముంది అనే అంశాలను తెలుగులో పూర్తి స్థాయిలో మొదటిసారి తెలుగోడ(telugoda.com) అందిస్తోంది.

ప్రస్తుతం దేశమంతటా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు గురించే చర్చ జరుగుతోంది. బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థకు మోక్షం లేదన్న స్థాయిలో రాజకీయ నాయకుల నోట ప్రతి రోజు వినిపిస్తోంది. ఇంతకీ ఏమిటా బిల్లు ? … కథా కమామీషు తెలుసుకుందాం…. నిజానికి ఇది కూడా ఒక రకంగా మన నెత్తిన పడే పన్ను పోటే.

మనం ఏదైనా ఒక వస్తువును కొన్నా, లేక మరొకరి నుంచి ఏ రూపంలోనైనా సేవ అందుకుంటే మనం కట్టే పన్ను ఇది. అయితే తేడా ఏమిటంటే, అందులో ఇతర రకాలైన పన్నుల భారమంతా ఏకమైపోయి, మనం పన్ను మీద పన్ను చెల్లించవలసిన భారాన్ని తగ్గించేస్తుందీ కొత్త రూపంలోని జిఎస్‌టి. అంటే వస్తు, సేవల పన్ను. ఇలా ఒక్కదానిలోనే మిగిలినవన్నీ కలుస్తాయి. వేర్వేరుగా పన్ను చెల్లించే బాధ మనకు తగ్గుతుందన్న మాట.

జిఎస్టీ చరిత్ర ఏంటి..?

 • దాదాపుగా 140 దేశాలు జీఎస్టీని అమలుచేస్తున్నాయి.

 • ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, పాకిస్థాన్ లు కూడా దీన్ని అమలు చేస్తున్నాయి.

 • 1954లో ఫ్రాన్స్ లో మొదటిసారి జిఎస్టీని తీసుకువచ్చారు.

 • కెనడాలో 1991లో దిన్ని తీసుకువచ్చారు. దీని జిఎస్టీని 15శాతంగా నిర్ణయించారు. కాగా అక్కడ రెవెన్యూలో మంచి మార్పులు వచ్చాయి.

 • న్యుజిలాండ్ లో 1986లో తీసుకువచ్చారు. ముందు 10శాతం అనుకున్నా తర్వాత మాత్రం 12.5 శాతానికి పెంచారు. ఇక్కడ కూడా స్పీడ్ గా ఎకానమీ డెవలప్ మెంట్ వచ్చింది.

 • ఆస్ట్రేలియాలో 2000లో 10శాతంగా జీఎస్టీని దీన్ని తీసుకువచ్చారు. దీని వల్ల ఆస్ట్రేలియా ఎకనామికల్ గా మంచి లాభం పొందింది.

 • దీన్ని కేల్కర్ టాస్క్ ఫోర్స్ 2004లో ఇచ్చిన ఇంప్లిమెంట్ ఆఫ్ ఫిక్సల్ రెస్పాన్సిబిలిటి అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్ ఆక్ట్ 2003( implementation of Fiscal Reforms and Budget Management Act 2003) ప్రకారం తీసుకువచ్చారు.

GSTinput

జీఎస్టీ తీసుకురావడానికి ఉద్దేశం..

 • అన్ని రకాల డైరెక్ట్, ఇన్ డైరెక్ట్(ప్రత్యక్ష, పరోక్ష పన్నుల) ట్యాక్స్ లను కలిపేందుకు
 • కేంద్రం, రాష్ట్రం వేరే వేరుగా కాకుండా ఒకటే ట్యాక్స్ వసూల్ చెయ్యడానికి
 • ట్యాక్స్-జిడిపి శాతాన్ని పెంచడం(పన్నుల స్థాయిని జిడిపికి తగ్గట్టుగా పెంచడానికి)
 • ట్యాక్స్ ఎగ్గొట్టడం,అవినీతిని దూరం చెయ్యడానికి

ఏం జరిగింది..?
గతంలో యుపిఎ ప్రభుత్వం ఇదే జీఎస్టీ బిల్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడితే రాష్ట్రాలకు మంచిది కాదు అని ప్రచారం చేసి బిల్ ను నిలిపివేసింది. ఇప్పుడు అదే బిల్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి మోదీ సర్కార్ తీసుకువచ్చింది. 2014లో దీన్ని పార్లమెంట్ లో బిల్ గా ప్రతిపాదన తీసుకువచ్చినా గత మే నెలలో దీనికి లోక్ సభ ఆమోదం తెలిపింది. కానీ రాజ్యసభలో బిజెపికి బలం లేకపోవడం, ప్రతిపక్షం కాంగ్రెస్ కు బలం ఉండటంతో బిల్ అటకెక్కే పరిస్థితి ఉంది. జీఎస్టీని కాంగ్రెస్ స్వాగతిస్తున్నా కొన్ని రాజకీయ కారణాల వల్ల అడ్డుపుల్లవేస్తోంది. అయినా కానీ తాము ప్రతిపాదించిన వ్యవస్థాగత మార్పులకు మోదీ సర్కార్ ఓకే చేస్తే ఖచ్చితంగా రాజ్యసభలో దీన్ని పాస్ చేయిస్తామని కాంగ్రెస్ అంటోంది.

కాంగ్రెస్ డిమాండ్లు ఏంటి..?

 • వస్తు, సేవల పన్ను గరిష్ట పరిమితి 18 శాతం మించరాదని బిల్లులోనే స్పష్టంగా ప్రతిపాదించాలని కాంగ్రెస్‌ కోరుతోంది.

 • బిల్లులో ప్రతిపాదించిన 1 శాతం అదనపు పన్నును, ముఖ్యంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలపై విధించేందుకు ఉద్దేశించిన నిబంధనను తొలగించివేయాలని ఆ పార్టీ సూచించింది. (నిజానికి ఇలా అదనుప పన్ను అవసరమని అలాంటి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఎందుకంటే తమ రాష్ట్రంలో ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలను     కల్పించినందుకు తాము పెట్టిన పెట్టుబడిని ఈ అదనపు 1 శాతం లెవీతో తిరిగి రాబట్టుకుంటామనేది ఆ రాష్ట్రాల వాదన)

 • వచ్చే పన్నులో మూడొంతులు రాష్ట్రాలకు ఒక వంతు కేంద్రానికి చెందాలి అన్నది కాంగ్రెస్ డిమాండ్. అయితే ఈ డిమాండ్‌కు రాజ్యసభ స్టాండింగ్‌ కమిటీ నుంచే వ్యతిరేకత వచ్చింది.

జీఎస్టీలో లోపాలేంటి..?

 • దీన్ని అమలుచెయ్యడానికి అవసరమైన స్కిల్స్ అధికారుల్లో లేకపోవడం

 • జీఎస్టీ అమలుకు ఐటీ టెక్నాలజీ వాడాల్సి ఉంటుంది. కానీ అది అంత సులభం కాదు

 • కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల వాటా తేలడం అనేది అన్నింటికి మించిన సమస్య

 • రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా దెబ్బతింటుంది అనే ఓ వాదన ఉంది.

  – Abhinavachary

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
ఇదే జగ‘నిజం’
సింధూరంలో రాజకీయం
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
మోదీ భజన అందుకేనా?
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!

Comments

comments