ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి

This is the Jagans Dedication on AP Special Status

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత నాటి హామీ ప్రకారం ప్రత్యేక హోదా కల్పిస్తామన్న కేంద్రం చేతులెత్తేసింది. ఏపిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడ ప్రభుత్వం కేంద్రానికి దాసోహం అన్నట్లు వ్యవహరిస్తోంది. కేంద్రం నిర్వాకం, అక్కడి అదికారపక్షం నిర్లక్షం కారణంగా ప్రత్యేక హోదా అంశం అటకెక్కింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఎత్తిచూపుతూ ప్రతి ఒక్కరిని ముద్దాయిలుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవలసింది కేటీఆర్ పేరు.

తెలంగాణ ఉద్యమం టైంలో ఎంతో చిత్తశుద్దితో ఉద్యమించడం వల్లే రాష్ట్రం సాధ్యమవుతుందని కేటీఆర్ అన్నారు. ఏపి నాయకులకు చిత్తశుద్దిలేదు అని కూడా అన్నారు. కేటీఆర్ మాట్లాడిన ఈ మాట మీద జగన్ డిజిటల్ సేన స్పందించింది. జగన్ చిత్తశుద్ధిని శంకించడం ఏంటి అని నెట్ లో జగన్ అభిమానులు విమర్శలకు దిగుతున్నారు. జగన్ డిజిటల్ సేన మరోసారి తన ప్రతాపాన్ని, తమ నాయకుడి చిత్తశుద్ధిని ఎలుగెత్తి చూపించే ప్రయత్నం గట్టిగా చేస్తోంది.

నిజానికి ఏపికి ప్రత్యేక హోదా కావాలని పోరాడుతున్న జగన్ మీద కేటీఆర్ మాట్లాడటం ఏంటి అని నిలదీస్తున్నారు. నాడు కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చినప్పటి నుండి ఇప్పుడు ఉద్యమానికి సిద్ధమవుతున్న వరకు జగన్ నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్రం ప్రత్యేక హోదా లేదు కేవలం ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే అని తేల్చేసింది. దాంతో జగన్ ప్రజాపోరాటానికి సిద్ధమవుతున్నారు. కానీ నిజాలు తెలుసుకోకుండా ఏపిలో ప్రత్యేక హోదాపై ఎవరికి చిత్తశుద్ధిలేదు అని అనడంపై జగన్ డిజిటల్ సేన ఆక్షేపిస్తోంది.

జగన్ కు ప్రత్యేక హోదాపై ఉన్న చిత్తశుద్ధి ఆయన చేస్తున్న పోరాటమే నిదర్శనమని.. ఆయన చేసిన, చెయ్యబోతున్న కార్యక్రమాల వివరాలను వివరించింది  జగన్ డిజిటల్ సేన. 2015 నుండి జగన్ ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని ఎలా పోరాడుతున్నారో జగన్ డిజిటల్ సేన సవివరంగా వివరించింది. ఏపికి ప్రత్యేక హోదా మాత్రమే సంజీవని అని, చంద్రబాబు, కేంద్రం ప్రత్యేక హోదాపై మాట మారుస్తున్నారని అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మార్చ్ 2015లో జగన్ తన పార్టీ ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయాన్ని డిజిటల్ సేన వెల్లడించింది.మే నెలలో హోదా కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ దగ్గర ధర్నా చేసిన విషయాన్ని జగన్ డిజిటల్ సేన అందరి దృష్టికి తీసుకువచ్చింది.

2015 జూన్ 3, 4 రోజుల్లో ప్రత్యేక హోదా కోరుతూ మంగళగిరిలో జగన్ రెండు రోజుల సమర దీక్ష చెయ్యడం జగన్ చిత్తశుద్ధి ఎంటో తెలుస్తోంది అని జగన్ అభిమానులు గొంతెత్తారు. 2015 జూన్ 9న ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 2015 ఆగష్టు 10 ప్రత్యేక హోదా కోరుతూ దిల్లీలో జగన్ దర్నా నిర్వహించడం,  2015 ఆగష్టు 15 నాడు జగన్ రాసిన లేఖకు సమాధానంగా ప్రత్యేక హోదా లేదు అని కేంద్రం లేఖ రాసిన విషయాన్ని జగన్ డిజిటల్ సేన గుర్తు చేసింది.

29 ఆగష్టు 2015నాడు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 15 సెప్టెంబర్ 2015నాడు ప్రత్యేక హోదా కోరుతూ జగన్ తిరుపతిలో యువభేరి నిర్వహించిన విషయాన్ని జగన్ డిజిటల్ సేన మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది. 22 సెప్టెంబర్ 2015 రోజు ప్రత్యేక హోదా కోరుతూ జగన్ విశాఖలో యువభేరి నిర్వహించారు. 7 అక్టోబర్ 2015 నాడు ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ అధినేత జగన్ నల్లపాడులో ఆరు రోజుల నిరాహార దీక్ష చేశారు.

2016 జనవరి 27నాడు ప్రత్యేక హోదా కోరుతూ జగన్ కాకినాడలొ  యువభేరి నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసింది జగన్ డిజిటల్ సేన. 2016 ఫిబ్రవరి 2నాడు శ్రీకాకుళంలో ప్రత్యేక హోదా కోరుతూ యువభేరి నిర్వహించారు. 2016 ఫిబ్రవరి 24 రోజు ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ రాష్ట్రపతికి వినతి చేశారు. 2016 మే 10 నాడు ప్రత్యేక హోదా కోరుతూ కాకినాడ కలెక్టరేట్ దగ్గర జగన్ ధర్నా నిర్వహించారు.  2016 ఆగష్టు 2నాడు ప్రత్యేక హోదా కోరుతూ జగన్ బంద్ కు పిలుపునిచ్చారు. ఆగష్టు 4న నెల్లూరులో జగన్ యువభేరి నిర్వహించారు. 2016 ఆగష్టు 8న ప్రత్యేక హోదా కోసం జగన్ మరోసారి రాష్ట్రపతిని కలిసిన విషయాన్ని గుర్తుచేసింది జగన్ డిజిటల్ సేన. 2016 సెప్టెంబర్ 10 నాడు కేంద్రం ప్రత్యేక హోదాపై చేసిన మోసానికి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు జగన్.

jagan-digital

జగన్ ఏపి ప్రత్యేక రాష్ట్రంగా మారినప్పటి నుండి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఏపిలో ఎవరికి చిత్తశుద్ధిలేదు అని అనడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది జగన్ డిజిటల్ సేన. కేటీఆర్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని జగన్ డిజిటల్ సేన చురకలంటించింది. మొత్తంగా జగన్ చేస్తున్న అలుపెరుగని ప్రత్యేక హోదా పోరాటానికి బాసటగా నిలుస్తోంది జగన్ డిజిటల్ సేన.

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
ఓడినా విజేతనే.. భారత సింధూరం
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
మంత్రుల ఫోన్లు బంద్
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
తెలంగాణ 3300 కోట్లు పాయె
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..

Comments

comments