‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే

This is the real problem in Hyderabad

తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా చెప్పకునే హైదరాబాద్ చినుకుపడితే చిత్తడిగా మారుతోంది. ఎక్కడపడితే అక్కడ గుంత తీసి.. వాటిని పట్టించుకోని కారణంగా రోడ్ల మీద పరిస్థితి దారుణంగా మారుతోంది. వర్షం చినుకు పడితే చాలు చెరువుల్లా మారుతున్నాయి వీధులు. రోడ్ల మీద ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు. నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి.. వాటిని ఎక్కడి నుండి పంపించాలి అనే దానిపై ఎవరికి క్లారిటీ ఉండదు. గ్లోబల్ గ్లోబల్ అంటూ గూబలు వాచిపోయేలా ప్రచారం చేస్తున్న టి సర్కార్ ఎందుకు హైదరా‘బాధ’ను దూరం చెయ్యలేకపోతోంది అని ఆలోచించాల్సిన అవసరం ఉంది.

రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరెన్నికగన్న సిటీగా హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఐటీ రంగం నుండి బిర్యానీ వరకు అన్నింటా హైదరాబాద్ మార్క్ కనిపిస్తుంది. ఇక్కడ సగటు జీవి ప్రశాంతంగా బ్రతకొచ్చు. అలాంటి హైదరాబాద్ లోని జనాలను చిత్తడి చింతించేలా చేస్తోంది. తొలకరి వర్షం మొదలుకాగానే రైతులు ఆనందంతో చిందులు వేస్తుంటే.. హైదరాబాద్ లో మాత్రం జనాలు చిరాకు పడుతుంటారు. ఇలా ఎందుకు అంటే ఇక్కడ పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది. అడుగుతీసి అడుగు వేద్దమంటే ఎక్కడ గుంట ఉంటుందో తెలియదు.. మ్యాన్ హోల్స్ గురించి అయితే హైదరాబాద్ వాసులకు తెలిసినంత ఎవరికి తెలిసి ఉండదు.

మెట్రో పనుల కోసం అంటూ సగం హైదరాబాద్ రోడ్లను తవ్వేశారు ఎల్ అండ్ టీ గ్రూప్ వాళ్లు. మీకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం అని బోర్డులు మాత్రం కనిపిస్తాయి.. అంతే కానీ ముందు గుంత ఉంది జాగ్రత్త అనే బోర్డ్ మాత్రం కనిపించదు. ఆర్ అండ్ బి వాళ్లు ఎక్కడపడితే అక్కడ రోడ్లను తవ్వేస్తుంటారు. ఇక బిఎస్ఎన్ఎల్ వాళ్లైంతే మరీనూ.. మేం మాత్రం తక్కువా అంటూ హెచ్ఎండీఏ వాళ్లు కూడా రోడ్లను తవ్వేస్తారు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. అన్ని శాఖల మధ్య సమన్వయం(కోఆర్డినేషన్) లేకపోవడం. పలానా రోడ్డును తవ్వుతున్నాం.. మీకు అక్కడ ఏమైనా అవసరాలుంటే ఒకేసారి కలిసి పూర్తి చేద్దాం అని ఓ శాఖ మరో శాఖకు ఎలాంటి సమాచారం పంపదు.. అలా కాకుండా సమాచారాన్ని పంపిస్తే అన్ని శాఖలు కలిసి పని చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది.

హైదరాబాద్ మీద ముందు నుండి ప్రత్యేక శ్రద్దను కనబరుస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ మొన్నా మధ్యన సిటీలో పర్యటించి.. అన్ని శాఖలు ఒకదానితో మరొకటి కోఆర్డినేట్ చేసుకోవాలి అని సూచించారు. కానీ వాటిని ఎవరూ పాటించడం లేదు. అన్నింటికి మించి రోడ్ల మీద గుంతలు తవ్వడం వర్షాకాలం ముందు కల్లా అన్ని చోట్ల పూర్తి చెయ్యాలి.. కానీ వర్షాకాలం దగ్గరపడ్డప్పుడు కూడా తవ్వడం మొదలుపెడితే పరిస్థితి ఇలానే ఉంటుంది. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ నగరంలో ఓ చిన్న సమస్య వచ్చినా వెంటనే అక్కడికి చేరుకొని సమస్యకు పరిష్కారం కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లే అనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో (గ్రౌండ్ లెవల్)మాత్రం దాని రిజల్ట్ మాత్రం కనిపించడం లేదు. మరి ఇప్పటికైనా అయ్యవార్లు స్పందించి.. గుంతలులేని హైదరాబాద్ ను, అవస్థలులేని వ్యవస్థను, ట్రాఫిక్ లేని రోడ్లను అందించాలంటే మేల్కోవాల్సిందే. జాగో… ఆఫీసర్ జాగో

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
అడకత్తెరలో కేసీఆర్
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
ఉక్కిరిబిక్కిరి
చంద్రుడి మాయ Diversion Master
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
ఎవరు చాణిక్యులు..?
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
మద్యల నీ గోలేంది..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
ప్రత్యేక హోదా లాభాలు
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
మెరుపు దాడి... నిజమా-కాదా?
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?

Comments

comments