ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి

This is the Special Cheating to AndhraPradesh

ఏపికి ‘ప్రత్యేకం’ అంటూనే కే్ంద్రం నిలువునా ముంచేసింది. ముందు నుండి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న బిజెపి.. ప్రజలను మోసం చేస్తోంది. ఏపికి జరిగిన అన్యాయం మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీద ఉండవల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వెంకయ్య నాయుడు నిజం చెప్పకుండా సమాధానాన్ని దాటవేసేవాడని, కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా అబద్ధాలు చెబుతున్నారని ఉండవల్లి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. హోదా అవసరం లేనప్పుడు పార్లమెంట్ లో ఎందుకు అడిగారని ఆయన ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడు అబద్దాలు మాట్లాడి దొరికి పోయారని.. ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని  ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో వెంకయ్య గట్టిగా పట్టుబట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా హామీతోనే టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు హామీని నిలబెట్టుకోలేదని తెలిపారు. విభజనతో పరిశ్రమలన్నీ హైదరాబాద్ కే పరిమితమయ్యాయని చెప్పారు. ఏపీ రెవెన్యూ లోటును ఏవిధంగా భర్తీ చేస్తారో కేంద్రం చెప్పడం లేదని వాపోయారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తనతో స్వయంగా ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు అభిజిత్ సింగ్ చెప్పారని వెల్లడించారు. ఆర్థికంగా వెనుబడిన రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయాలని రఘురామ్ రాజన్ కమిటీ చెప్పిందని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెటకారంగా మాట్లాడారని మండిపడ్డారు. ఆంధ్ర వాళ్లు అంటే అంత లోకువా..? అని ఉండవల్లి ప్రశ్నించారు. అరుణ్ జైట్లీ ప్రసంగం విన్న తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రక్తం మరుగుతోందని అన్నారని తెలిపారు. మరి ఇంత జరుగుతున్నా కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.

ఏపి రాజధాని కోసం నాడు చంద్రబాబు నాయుడు ఏకంగా 4 నుండి 5 లక్షల కోట్లు కావాలని అడిగితే కేంద్రం ఇచ్చిందేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు 4-5 లక్షల కోట్లు అడిగితే 2500 కోట్లు ఇప్పటికే చెల్లించారని, మిగిలిన 1000 కోట్లను చెల్లిస్తామని కేంద్రం ప్రకటించినట్లు ఆయన అన్నారు. అంటే నాలుగైదు లక్షల కోట్లు అవసరమైన రాజధానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయం కింద కేవలం మూడు వేల ఐదు వందట కోట్లు మాత్రమే ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక పోలవరం మీద కూడా అరుణ్ కుమార్ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో నాటి యుపిఎ సర్కార్ పేర్కొన్నదని, అదే విషయాన్ని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది కాబట్టే ఇచ్చేశాము అని జైట్లీ అనడం ఏంటి అని నిలదీశారు. రాసిన చట్టాలకి, చెప్పిన మాటలకు విలువ లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంలోనే ఆరోగ్యకరమైన విషయం కాదు అని అభిప్రాయపడ్డారు.

మొత్తానికి ఏపికి కేంద్రంలో వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ మోదీతో కలిసి అన్యాయం చేశారు. కేంద్రంలో పరిస్థితి అలా ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు కూడా ఏమీచెయ్యలేకపోతున్నారని అన్నారు. ఏపిని అందరూ కలిసి దగా చేశారు అన్న విషయం మాత్రం తేలిపోయింది. విభజన సమయం నుండి ప్రత్యేక సహాయం వరకు ఆడిన నాటకాలు కూడా ఇదే విషయాన్ని తెలుపుతున్నాయి. మోసం చెయ్యడంలో ఎవరికి ఎవరు తీసిపోవడంలేదు. మరి చూడాలి ప్రత్యేక హోదా విషయంలో దగా చేసిన వారికి ప్రజలు ఏవిధంగా బుద్ధిచెబుతారో…

Related posts:
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
సింగ్ ఈజ్ కింగ్
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
కాశ్మీర్ భారత్‌లో భాగమే
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
మోదీ ప్రాణానికి ముప్పు
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
గాలిలో విమానం.. అందులో సిఎం
అమ్మ పరిస్థితి ఏంటి?
తిరిగిరాని లోకాలకు జయ
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
గ్రామీణ బ్యాంకులను ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్
మోదీ మీద మర్డర్ కేసు!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

Comments

comments