పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు

This New couple donate Marriage expenditure on that

మన దేశంలో పెళ్లి అంటే అదో హడావిడి… ఎవరికి తగ్గట్లు వాళ్లు, తమ తమ తాహతకు తగ్గట్టుగా చేస్తుంటారు. కొంత మంది లక్షలు ఖర్చు చేస్తుంటే మరికొంత మంది కోట్లు ఖర్చుచేస్తుంటారు. కొంత మంది మాత్రం గుళ్ల దగ్గర సామూహిక పెళ్లిళ్లకు సిద్దమవుతుంటారు. నిజానికి పెళ్లి తంతు అనేది ఇప్పుడు పరువుకు సంబందించిన మ్యాటర్. ఎంత హడావిడిగా పెళ్లి చేసుకుంటే, ఎంత ఖర్చు చేస్తే అంత గ్రేట్ అని చెప్పుకునే పరిస్థితి. కానీ నాగ్ పూర్ కు చెందిన ఓ జంట మాత్రం అందుకు భిన్నం. వాళ్ల పెళ్లికి చేయాల్సిన ఖర్చును అలాగే దాచి చేసిన గొప్ప సహాయానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.

ఈ మధ్యనే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు సెలెక్ట్ అయిన నాగ్ పూర్ కు చెందిన అభరు దివారే, ఐడీబీఐ ముంబై బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ ఇద్దరూ సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేటైంలో ప్రేమలో పడ్డారు. అయితే పెళ్లిళ్ల కోసం చాలా మంది తమ ఆస్తులను అమ్మేసుకుంటున్నారు. విదర్భలాంటి చోట్ల రైతులు ఆత్మహత్యలకు పెళ్లిళ్లు కూడా కారణమవుతున్నాయి. పిల్లలకు ఘనంగా పెళ్లి చేయాలన్న తపన వారిని అప్పుల ఊబిలో పడేస్తోంది. దాంట్లోంచి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అభరు, ప్రీతిల గ్రామాల్లో సైతం ఇది పెద్ద సమస్యగా ఉంది.అయితే దీని మీద వాళ్లు ఏదో ఒకటి చెయ్యాలని అనుకున్నారు.

పెళ్లికి లక్షలు ఖర్చు చెయ్యడం ఎందుకు వేస్ట్.. సాదాసీదాగా పెళ్లి చేసుకుంటే అంతా బాగుంటుంది కదా అని అనుకున్నారు. దాంతో ఓ చిన్న కమ్యూనిటి హాల్ లో పెళ్లి చేసుకున్నారు కానీ ఎలాంటి హడావిడి లేకుండా. ఆ పెళ్లిలో బాజాభజంత్రీలు లేవు. హంగులు, ఆర్భాటాలు అసలే లేవు. ‘పే బ్యాక్‌ టూ సొసైటీ’ క్యాప్షన్‌తో అంబేద్కర్‌ పోస్టర్‌ సాక్షిగా ఒక్కటయ్యారు. అయితే పెళ్లికయ్యే ఆ ఖర్చునే మరో విధంగా ఉపయోగించాలను కుంది ఆ జంట. ఆత్మహత్యలు చేసుకున్న పది రైతు కుటుంబాలను ఎంచుకుని… ఒక్కో కుటుంబానికి 20 వేల చొప్పున డొనేట్‌ చేశారు. అంతేకాదు, 52వేల విలువ చేసే వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను అమరావతిలోని ఐదు లైబ్రరీలకు ఇచ్చారు. ఇలాంటి వాళ్లకు మనం మనసారా సలాం చెయ్యాల్సిందే.

Related posts:
ఇదో విడ్డూరం
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
కృష్ణా పుష్కర భక్తులకు హెచ్చరిక: కృష్ణా జలాల్లో బ్యాక్టీరియా
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
ఈ SAM ఏంటి గురూ..?
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
చెబితే 50.. దొరికితే 90
అమ్మను పంపించేశారా?
ట్రంప్ సంచలన నిర్ణయం
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
ఒక్క రూపాయికే చీర
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments