ఇదే జగ‘నిజం’

Jaganism

ఏపిలో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు జరుగుతున్న రాజకీయ యుధ్దంలో కొన్ని శక్తులు ఓ వర్గానికి. ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఎదుటి పక్షాన్ని చిత్తు చెయ్యాలని చేస్తున్న ప్రయత్నాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ను కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించడానికి లోటస్ పాండ్ కు వెళితే ఆ  మంత్రిని కలిసేందుకు జగన్ నిరాకరించాడని.. అవమానించారని వార్తలు వచ్చాయి. ఇలా ఈ వార్త బయటకు వచ్చిందో లేదో వెంటనే సోషల్ మీడియాలో జగన్ అభిమానులు సోషల్ మీడియాలో దండయాత్ర మొదలుపెట్టారు.

పచ్చ మీడియా చేస్తున్న అతిని.. వెంటనే ఎండగట్టింది జగన్ డిజిటల్ సేన. అసలు రావెల కిషోర్ బాబుకు అవమానం జరిగింది అన్న వార్తల అసత్యప్రచారం అని, జగన్మోహన్ రెడ్డి అతిథి మర్యాదలతో రావెల కిషోర్ బాబుకు ఆహ్వానం పలికారని.. ఆయనకు తేనీటి విందు ఇచ్చి కాసేపు ముచ్చటించారని తెలిసింది. దానికి సంబందించిన ఫోటోలను కూడా ప్రూఫ్ లుగా చూపించింది.

వచ్చిన అతిథిని మర్యాద పూర్వకంగా కలవడం మన సంస్రృతి. మరి దీన్ని జగన్ ఎలా మరిచిపోతాడు అని ఎల్లో మీడియా ఊహించిందో తెలియదు. అసలు రావెలతో కలిసి జగన్ టీ తాగిన సన్నివేశాన్ని మొత్తంగా మార్చేసి.. కొత్త సినిమాలో గ్రాఫిక్స్ మాదిరిగా ఆయన(రావెల) లోటస్ పాండ్ బయట నిలబడి ఉన్న ఫోటోలతో మంత్రికి అవమానం అని వార్త రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Andhrajyothy article

ఇక్కడ కొన్ని విషయాలను కాస్త దగ్గరి నుండి గమనించాలి:
ఏపి మంత్రి రావెల కిషోర్ లోటస్ పాండ్ కు వచ్చారు. జగన్ ను కలిసేందుకు వచ్చిన రావెల కిషోర్ గురించి దళిత మంత్రి కార్డు ఎవరు ఇచ్చారు..?
– కిషోర్ బాబుకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు అనే వార్త ఎవరు పుట్టించారు..?
– అన్నింటి కంటే ముందు కృష్ణా పుష్కరాలు హిందు  సంప్రదాయానికి చెందినవి అయితే క్రిస్టియన్  మంత్రిని(రావెల కిషోర్ బాబు) ఎందుకు ఆహ్వానించడానికి పంపించారు..?
పుష్కరాలు ప్రారంభమైన తర్వాత జగన్ ను ప్రభుత్వం కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించడం ఏంటి..?
– అతిథి మర్యాదలు చేసిన జగన్ గురించి ఇంతలోనే ఎందుకు కావాలని విష ప్రచారం చేశారు..?

తెలుగు మీడియాలో ఈ రకంగా వచ్చిన వార్తపై అసలు నిజాలను నిగ్గుతేల్చడానికి తెలుగోడ ప్రయత్నించింది. లోటస్ పాండ్ నుండి తెలుగోడకు వచ్చిన సమాచారం ప్రకారం అవన్నీ అసత్యాలని, ప్రజలే ఇలాంటి వాటికి తగిన బుద్దిచెబుతారని, వారి వద్ద ఉన్న వాస్తవ చిత్రాలను(రావెల, జగన్‌లు టీ తాగుతున్న ఫోటోలను) అందించడం జరిగింది.

Jagan with Ravela

చెప్పలేని, రాయలేని పదాలతో ఆ వార్తను రాసిన మీడియాపై, దాని వెనకుండి రాజకీయం చేసిన వారిపై విరుచుకుపడింది జగన్ డిజిటల్ సేన. జగన్ గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటూ మూకుమ్మడి దాడి చేసింది. నెటిజన్లు జగన్, రావెలకు టీ విందు ఇస్తున్న ఫోటోలను చూపిస్తూ అసలు సత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. జగన్ మీద ఇలాంటి తప్పుడు ప్రచారం చెయ్యడం అంటే ఆకాశం మీద ఉమ్మివేయడం అని జగన్ వీరాభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.  ఇలా తమ ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి తప్పుడు దారులు వెతికి.. తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యడం అంటే నిజాన్ని అబద్దం అని చిత్రీకరించడమే. ఆంధ్రజ్యోతిలాంటి బడా పేపర్ లో ఇలాంటి తప్పుడు వార్త వచ్చినా.. దాన్ని జగన్ డిజిటల్ సేన సమర్థవంతంగా ఎండగట్టింది.

మీడియా అంటే జరిగిన ఘటనలపై నిజాలను వెలుగులోకి తీసుకువచ్చేలా లోతుగా అధ్యయనం చేసి వార్తలను ప్రచారం, ప్రసారం చెయ్యాలి. అంతేకానీ ఓ వర్గానికి కొమ్ముకాస్తూ.. మరోవర్గానికి వ్యతిరేకంగా పని చెయ్యడం జర్నలిజం విలువలను దిగజార్చడమే. జరగని వాటిపై.. అసలు లేని వాటిపై ఊహిస్తూ ఎవరినో టార్గెట్ గా చేస్తూ వార్తలను రాయడం మానుకుంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది.

Related posts:
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
టాప్ గేర్ లో ముద్రగడ
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
ఇక యుద్ధమే కానీ..
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్

Comments

comments