వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా

This the Real Hijra Story

దేవుడు పుట్టించిన మనుషుల మధ్య తేడాలను కనిపెట్టింది అదే మనిషి. నువ్వు ఆడ, నువ్వు మగ అని డిసైడ్ చేసుకొని బ్రతికేస్తున్నాం. మన దగ్గర హిజ్రాలకు మాత్రం అస్సలు విలువలేదు. కానీ ఈ స్టోరీ చదివిన తర్వాత మాత్రం హిజ్రాలు అంటే గౌరవం పెరుగుతుంది. ఓ హిజ్రా చూపిన మానవతను ఖచ్చితంగా అందరం స్వాగతించాలి. తనకు పుట్టిన కొడుక్కి తన చెల్లెలి కూతురే భార్య అని ఊహ కూడా తెలియని ఓ వ్యక్తి నిజజీవిత కథ ఇది.

తనకు పుట్టిన మగ పిల్లాడు పెద్దయ్యాక  మా అబ్బాయి చేసుకునేది మీ అమ్మాయినే అని ఆ పిల్లాడి తండ్రి, తన చెల్లెలికి మాటిచ్చాడు. ఈ లోపే పిల్లాడు పెరిగి పెద్దవుతున్నాడు…ఇంతలోనే పిల్లాడి అత్తకు ఓ కూతురు కూడా పుట్టింది. ఇంకేముంది ముందుగా అనుకున్న మాటే…ఇప్పుడు బాహాటంగా అంటున్నారు. నువ్వు చేసుకోబోయేది మీ బావానే అంటూ ఆమెను, మీ మరదలినే అంటూ ఇటు ఆ కుర్రాడిని అందరూ ఆటపట్టిస్తున్నారు. అమ్మాయికి , అబ్బాయికి కూడా ఇష్టమే…ఇక పెళ్లే తరువాయి.

అయితే అబ్బాయి… తనకు వయస్సు వస్తున్నా,తన శరీరంలో మార్పులు రాకపోవడాన్ని గమనించాడు. తన వయస్సు ఉన్న అబ్బాయిల ప్రవర్తనకు తన ప్రవర్తనకు చాలా తేడా ఉండడాన్ని గమనించాడు. తీరా తనకు తెలిసిందేంటంటే…  తను ఓ హిజ్రా.!  ఈ విషయాన్ని బయటికి చెప్పలేక, లోపల దాచుకోలేక నరకయాతన పడుతున్నాడు. ఎలాగైనా తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని  చెప్పాలనుకున్నాడు…కానీ వాళ్లది అసలే సాంప్రదాయ కుటుంబం..దానికి తోడు ఈ కుర్రాడి పెళ్లి పనుల్లో…వాళ్లంతా బిజీబిజీగా ఉన్నారు. చెప్పాలి… చెప్పాలి…అనుకునే లోపే…ముందుగా నిశ్చయించుకున్న ప్రకారం..ఆ అమ్మాయితో ఇతని పెళ్లి జరిగిపోయింది.

ఫస్ట్ నైట్…తన విషయాన్ని భార్యకు  చెప్పలేక, ఆ రాత్రిని మేనేజ్ చేయలేక చాలా ఇబ్బందిపడ్డాడు అతను. చివరకు ఓ రోజు తన భార్యను, తల్లిదండ్రులను కూర్చొబెట్టి తన పరిస్థితిని వివరించాడు. తాను సంసారానికి పనికిరానని క్లియర్ గా చెప్పాడు. తన భార్యకు వేరే పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు చెప్పి..ఇంట్లోంచి బయటికొచ్చేశాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎటు వెళుతున్నాడో అతనికే తెలియదు. కానీ చివరకు తనలా ఉన్న వారి చెంతకు చేరాడు. ఇప్పుడు అతను అక్కడ అసలైన ఆనందం పొందుతున్నాడు.ఎవరు ఏం అనుకుంటారో అన్న భయంలేకుండా…తనకు తోచినట్టుగా ఉంటున్నాడు. చాలా మంది గృహ ప్రవేశాలకు, పుట్టిన రోజు వేడుకలకు, పెళ్ళి రోజు వేడుకలకు హిజ్రాలు వచ్చి నృత్యాలు చేస్తే శుభం జరుగుతుందని భావిస్తారు…ఈ క్రమంలో వీరికి బాగా డిమాండ్ ఉండేది. దీంతో ఈ కుర్రాడు కూడా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మంచిగానే డబ్బు సంపాదిస్తున్నాడు.

ఓ రోజు….సడెన్ గా అతను ఉంటున్న గది డోర్ ధడ్ ,ధడ్ అంటూ చప్పుడైంది. ఎవరా? అని తెరిచి చూసేవరకు…చంకలో చిన్న పిల్లాడితో తన భార్య.! ఎంటా? అని ఆరాతీశాడు. నువ్వు వచ్చాక అత్తామామ నన్ను ఒకతనికి ఇచ్చి పెళ్లిచేశారు. వాడి పచ్చితాగుబోతుగా మారాడు. ప్రతిరోజు గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు. వేశ్యల చుట్టూ తిరుగుతున్నాడు. నన్ను, అతని వల్ల కలిగిన ఈ పిల్లాడిని కూడా సరిగ్గా చూసుకోట్లేదని తన బాధనంతా వెల్లబోసుకుంది అతని ముందు.

ఆమెను ఆ రోజు రాత్రి తన గదిలో ఉంచుకొని…ఉదయాన్నే ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ను కిరాయికి తీసుకొని..అందులో ఉంచాడు. అతనికి విడాకులు ఇచ్చేయ్ అని ఆ పనిని దగ్గరుండి చూసుకున్నాడు.  ఇక అతడి వల్ల కలిగిన కొడుకును తన సొంత కొడుకుగా చూసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంటి ఖర్చు, పిల్లాడి చదువు కొరకు ప్రతి నెల 20 వేల రూపాయలు.. ఆమెకు ఇస్తున్నాడు. అలా చదివిన ఆ పిల్లాడు ఎంబీఏ పూర్తి చేసుకొని ఓ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇటీవలే అతనికి పెళ్లి కూడా అయ్యింది.లవ్ మ్యారేజ్…ఆ పెళ్లిని కూడా హిజ్రాగా మారిన వ్యక్తే దగ్గరుండి మరీ తన ఖర్చులతో జరిపించాడు.

ఇప్పుడు చెప్పండి…అసలైన హిజ్రాలు ఎవరు? పెళ్లి చేసుకొని పెళ్లాన్ని సరిగ్గా చూడని వాడా? పెళ్లాం ఉండగానే…ఇతర అమ్మాయిలతో కులికేవాడా?

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
ఆ అద్భుతానికి పాతికేళ్లు
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
జీఎస్టీ బిల్ కథ..
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
టాప్ గేర్ లో ముద్రగడ
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?
తొక్కితే తాటతీస్తారు
మీకో దండం.. ఏం జరుగుతోంది?
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?

Comments

comments